AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఫామ్‌ హౌస్‌లో ‌పేలిన తుపాకీ.. నాలుగేళ్ల చిన్నారి మృతి…

Air Gun Exploded In Farm House: తెలంగాణలోని సంగారెడ్డిలో విషాదం చోటుచేసుకుంది. ఫామ్‌ హౌస్‌లో ఎయిర్ గన్ పేలి ఓ బాలిక మృతిచెందింది. జిల్లాలోని జిన్నారం మండలం వావిలాల శివారులోని

Hyderabad: ఫామ్‌ హౌస్‌లో ‌పేలిన తుపాకీ.. నాలుగేళ్ల చిన్నారి మృతి...
Gun
Shaik Madar Saheb
|

Updated on: Mar 16, 2022 | 12:16 PM

Share

Air Gun Exploded In Farm House: తెలంగాణలోని సంగారెడ్డిలో విషాదం చోటుచేసుకుంది. ఫామ్‌ హౌస్‌లో ఎయిర్ గన్ పేలి ఓ బాలిక మృతిచెందింది. జిల్లాలోని జిన్నారం మండలం వావిలాల శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. శబ్దం విన్న స్థానికులు అక్కడికి చేరుకోని పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వావిలాల శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో మంగళవారం ఉదయం పది గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఫామ్ హౌస్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తి కుమార్తె శాన్వి(4) ఎయిర్‌గన్‌ పేలి తీవ్ర గాయాలపాలైంది. వెంటనే ఆమెను గడ్డిపోచారంలోని ఓ ఆర్‌ఎంపీ డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లారు. అయితే.. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని.. తాను చికిత్స చేయనని చెప్పాడు. అప్పటికే ఆమె మృతి చెందిందని పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని హైదరాబాద్‌లని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

నిజామాబాద్ జిల్లాకి చెందిన నాగరాజు కుటుంబంతో సహా వచ్చి గత కొద్దిరోజులుగా ఈ ఫామ్ హౌస్‌లో పనిచేస్తున్నట్లు పేర్కొంటున్నారు. కోతులను, కొంగలను తరమాడానికి ఈ ఏయిర్ గన్‌ను వాడుతున్నట్లు ఫాం హౌస్ సిబ్బంది పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఎయిర్ గన్‌తో పిల్లలు ఆడుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుందని సమాచారం. ఈ ఫామ్‌హౌస్ హైదరాబాద్‌కు చెందిన ప్రకాష్, ప్రసాద్ రావు అనే వ్యక్తులదని స్థానికులు తెలిపారు.

కాగా.. పిల్లలు ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అయితే.. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా కాల్చారా..? లేక పిల్లలు ఆడుకుంటుండగా గన్‌ పేలిందా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జిన్నారం పోలీసులు తెలిపారు.

Also Read:

Ukraine Crisis: శాంతించని పుతిన్.. ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా భీకర దాడులు.. అక్కడి తాజా పరిస్థితిపై న్యూస్ అప్‌డేట్స్

Cucumber Side Effects: మంచిదని దొసకాయలు తెగ తింటున్నారా ? అయితే ముందు ఈ విషయాలు తెలుసుకొండి..