Cucumber Side Effects: మంచిదని దొసకాయలు తెగ తింటున్నారా ? అయితే ముందు ఈ విషయాలు తెలుసుకొండి..

ఎండాకాలంలో దొసకాయలు (cucumber) చాల ఎక్కువగా తినేస్తుంటారు. ఇది శరీరాన్ని హైడ్రేట్‏గా ఉంచడంలో సహయపడుతుంది.

Cucumber Side Effects: మంచిదని దొసకాయలు తెగ తింటున్నారా ? అయితే ముందు ఈ విషయాలు తెలుసుకొండి..
Cucumber
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 16, 2022 | 11:31 AM

ఎండాకాలంలో దొసకాయలు (cucumber) చాల ఎక్కువగా తినేస్తుంటారు. ఇది శరీరాన్ని హైడ్రేట్‏గా ఉంచడంలో సహయపడుతుంది. అంతేకాకుండా.. బరువు తగ్గేందుకు డైట్ చేస్తున్నవారు ఈ దొసకాయలను సలాడ్‏గా తీసుకుంటారు. ఇవి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలనిస్తాయి. అయితే ఆరోగ్యానికి మంచి చేస్తుంది కదా ఎక్కువగా తినేస్తే శరీరంలో పలు సమస్యలను కలిగిస్తుంది. ఇంతకీ అవెంటో తెలుసుకుందామా.

రాత్రిపూట దొసకాయలను అస్సలు తినకూడదు.. పడుకోవడానికి కనీసం 3, 4 గంటల ముందు దొసకాయలను తింటే పర్లేదు. కానీ పడుకునే ముందు అస్సలు తినకూడదు. ఎందుకంటే ఆహారం తిన్న తర్వాత దొసకాయ తింటే తొందరగా జీర్ణం కాదు.. దీంతో నిద్రపై ప్రభావం చూపిస్తుంది. విటమిన్ కే.. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే దోసకాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కిడ్నీ సమస్యలను తగ్గిస్తాయి. అయితే అతిగా తినడం వలన శరీరంలోని అదనపు ద్రవాన్ని బయటకు పంపిస్తాయి. దీంతో డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంటుంది.

సెన్సిటివ్ పొట్ట ఉన్నవారు దొసకాయలు తినడం ప్రమాదమే.. ఎందుకంటే ఇందులో ఉండే కుకుర్బిటాసిన్ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. దీంతో జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే గ్యాస్ట్రైటిస్, గ్యాస్ సమస్యలు వస్తాయి. సైనస్ ఉన్నవారు దొసకాయలకు దూరంగా ఉండాలి. అలాగే శ్యాసకోశ సమస్యలు ఉన్నవారికి కూడా దొసకాయ మంచిది కాదు. చర్మ సమస్యలు ఉన్నవారు దొసకాయలను తినకూడదు. అమెరికన్ అకాడమీ ఆఫ్ అలెరజిక్ ఆస్తమా అండ్ ఇమ్యునాలజీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం దొసకాయ చర్మ అలెర్జీలను కలిగిస్తుంది. దీంతో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అలాగే దొసకాయలు.. నీళ్లు కలిపి అస్సలు తీసుకొవద్దు.. దొసకాయ తిన్న వెంటనే నీరు తాగకూడదు..

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే