ONGC Jobs 2022: CLAT ఆధారంగా ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ (ONGC).. క్లాట్‌ 2022 ఆధారంగా అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్‌ పోస్టుల (Assistant Legal Advisor Post) భర్తీకి..

ONGC Jobs 2022: CLAT ఆధారంగా ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..
Ongc
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 16, 2022 | 10:14 AM

ONGC Law Officer Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ (ONGC).. క్లాట్‌ 2022 ఆధారంగా అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్‌ పోస్టుల (Assistant Legal Advisor Post) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టులు: 4

పోస్టులు: అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్‌ పోస్టులు

వయోపరిమితి: జులై 31, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ. 60,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: లా గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అడ్వకేట్‌గా కనీసం 3 ఏళ్ల ప్రాక్టీస్‌ అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022.

క్లాట్‌ 2022 పరీక్ష తేదీ: మే 8, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IMSc Jobs: నెలకు రూ.62,000ల జీతంతో.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమేటికల్‌ సైన్సెస్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు..