Children Vaccine: తల్లిదండ్రులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు కోవిడ్ టీకా..

వేవ్‌లు, వేరియంట్లతో దడ పుట్టిస్తోంది మహమ్మారి కరోనా. దీని కట్టడికి ఏకైక మార్గం టీకాలే.  కోవిడ్-19ని ఎదుర్కొనేందుకు  దేశవ్యాప్తంగా ఇవాళ్టి 12-14 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్​ అందించనున్నారు.

Children Vaccine: తల్లిదండ్రులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు కోవిడ్ టీకా..
Children Vaccine
Follow us

|

Updated on: Mar 16, 2022 | 8:39 AM

వేవ్‌లు, వేరియంట్లతో దడ పుట్టిస్తోంది మహమ్మారి కరోనా(CORONA). దీని కట్టడికి ఏకైక మార్గం టీకాలే (Covid Vaccine).  కోవిడ్-19ని ఎదుర్కొనేందుకు  దేశవ్యాప్తంగా ఇవాళ్టి 12-14 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్​ అందించనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ఇప్పటికే ఖరారు చేసింది. ఈ వయసు పిల్లలు ఆంధ్రప్రదేశ్‌లో 14.50 లక్షలు ఉండగా.. తెలంగాణలో 17.23 లక్షల మంది చిన్నారు ఉన్నారు. అందిరికీ వ్యాక్సిన్ అందించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు పూర్తి చేశాయి. టీకా తీసుకోవాలంటే కోవిడ్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. లేకపోతే టీకా కేంద్రంలో కూడా పొందవచ్చు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో 2021 మార్చి 1 నాటికి 12-13 ఏళ్ల వయసు చిన్నారులు 4.7 కోట్ల మంది ఉన్నారు.అలాగే 60 ఏళ్ల దాటిన వారందరూ మార్చి 16 నుంచి ప్రికాషన్ డోసు (బుస్టర్ డోసు) తీసుకునేందుకు అర్హులు.

రెండో డోసు తీసుకున్న 9 నెలల (39వారాలు) తర్వాతే మూడో డోసు తీసుకోవాలి. మొదటి రెండు డోసులు ఏ కంపెనీ టీకా తీసుకుంటే దాన్నే కొనసాగించాలి. 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు పిల్లలదంరికీ కార్బెవ్యాక్స్​ టీకా మాత్రమే ఇవ్వాలి. ‘బయోలాజికల్ ఈ’ సంస్థ దీన్ని తయారు చేసింది.

మొదటి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసుకు 28 రోజుల గ్యాప్ ఉండాలి. 2010 తర్వాత జన్మించి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న పిల్లలందరూ కొవిన్ పోర్టల్​లో టీకా కోసం ​ రిజిస్టర్​ చేసుకునేందుకు అర్హులు.

ఇవి కూడా చదవండి: AP CM YS Jagan: రెండేళ్లలో పరీక్షా సమయం రాబోతోంది.. అంతా సిద్ధంగా ఉండాలిః సీఎం వైఎస్ జగన్

Holi 2022 bank holiday: కస్టమర్లకు అలెర్ట్.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకంటే!