ప్రపంచ దేశాలలో ఇండియన్ జుట్టు కు భారీ డిమాండ్…కేజీ కేశాలకు ధర ఎంతో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఎగుమతి అవుతున్న జుట్టు దిగుమతి చేసుకుంటాయి...ఇందులో ఇండోనేషియా అత్యధికంగా 31 శాతం జుట్టు నీ దిగుమతి చేసుకుంటుంది.తరవాత ఆస్ట్రియా 16.5శాతం,మయన్మార్ 14.6 శాతం,వియత్నాం,ఇటలీ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి.మన దేశం నుండి ఎగుమతి చేసే జుట్టు ఎక్కువగా వేస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,తమిళనాడు రాష్ట్రాలు ఎక్కువ జుట్టును ఎగుమతి చేస్తున్నాయి.

ప్రపంచ దేశాలలో ఇండియన్ జుట్టు కు భారీ డిమాండ్...కేజీ కేశాలకు ధర ఎంతో తెలుసా?
Follow us
Yellender Reddy Ramasagram

| Edited By: Jyothi Gadda

Updated on: Aug 13, 2023 | 2:48 PM

మన తల పై జుట్టు ఉన్నంత కాలం ఎంతో కేర్ తీసుకుంటాం..కానీ ఒక్కసారి సెలూన్ లో కటింగ్ అయింది అంటే అది మనకి వ్యర్థం తో సమానం.కానీ మనం వెస్టేజ్ అనుకున్న మన జుట్టు తో కోట్లాది రూపాయల బిజినెస్ జరుగుతుందని మీకు తెలుసా..?ఇండియన్ హెయిర్ కి ప్రపంచ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా జుట్టును ఎక్కువతి చేసే దేశాల్లో ఇండియా టాప్ వన్ లో ఉంది. వినడానికి కొత్త గా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా…ఇలా ప్రపంచ దేశాలకు ఎగుమతి అయిన జుట్టు తో ఏం చేస్తున్నారు…పూర్తి డిటైల్స్ మీ కోసం.

కురులతో కోట్ల ఆదాయం…అవును మీరు వింటున్నది నిజం. మనదేశంలో మనం వెస్టేజ్ అనుకునే మన జుట్టుతో కోట్ల లో వ్యాపారం జరుగుతుంది.సెలూన్ లలో, దేవస్థానలలో మనం వదిలేసే జుట్టుని ప్రైవేట్ వ్యక్తుల తో విదేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుంది.ఎగుమతి అయిన జుట్టు తో ఎక్కువగా విగ్ లు,కొన్ని రకాల మెడిసిన్ తో పాటు ఇతర అనేక వస్తువుల తయారీ లో ఉపయోగిస్తున్నారు.మన దగ్గర kg జుట్టు ఎంతో తెలుసా అక్షరాల 30వేల పై మాటే..ప్రపంచ వ్యాప్తంగా జుట్టు నీ ఎగుమతి చేసే దేశాల్లో ఇండియా 2,27,372 షిప్మెంట్ ఎగుమతి తో టాప్ వన్ లో ఉంది.ఇండోనేషియా29,230 షిప్ మెంట్ తో 2వ ప్లేస్ లో ,చైనా24128 షిప్ మెంట్ లతో మూడో స్థానం లో ఉన్నాయి.హాంకాంగ్,పాకిస్తాన్,బ్రెజిల్ తరవాతి స్థానాల్లో ఉన్నాయి. ఇండియాలో లభించే జుట్టుకి చాలా ప్రాధాన్యత ఉంది.ఇండియా లో లభించే జుట్టు కి ఎంతో నాణ్యత ఉంటుంది అందుకే చాలా దేశాల్లో ఇండియన్ హైర్ కి డిమాండ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్యాషన్ షోలు కాస్మోటిక్ రంగంలో కూడా ఉపయోగించే విగ్గులలో ఎక్కువ భాగం ఇండియన్ హేయిర్ నుండి తయారుచేసినవే.

ఇలా ఇండియా నుండి ఎగుమతి అయిన జుట్టుతో కోట్ల వ్యాపారం జరుగుతుంది.దాదాపు గా గడిచిన 5ఏళ్ల లో ముడు వేల 69 కోట్ల 39 లక్షల 60వేల 500 రూపాయలు విలువ కలిగిన జుట్టు ఇండియా నుండి విదేశాలకు ఎగుమతి అయింది.కేవలం 2022-2023 సంవత్సరంలో 14వందల ఒక కోట్ల 96 లక్షల దేభైముడు వేల ఎనిమిది వందల కోట్లు విలువ గల మనిషి జుట్టు విదేశాలకు ఎగుమతి అయింది.ఇది పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ అధికారికంగా ప్రకటించారు.ఇది కేవలం విదేశాలకు ఎగుమతి జరిగిన లెక్క…మన ఇండియాలో కూడా జుట్టు కు ఎంతో డిమాండ్ ఉంది.

ఇవి కూడా చదవండి

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఎగుమతి అవుతున్న జుట్టు దిగుమతి చేసుకుంటాయి…ఇందులో ఇండోనేషియా అత్యధికంగా 31 శాతం జుట్టు నీ దిగుమతి చేసుకుంటుంది.తరవాత ఆస్ట్రియా 16.5శాతం,మయన్మార్ 14.6 శాతం,వియత్నాం,ఇటలీ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి.మన దేశం నుండి ఎగుమతి చేసే జుట్టు ఎక్కువగా వేస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,తమిళనాడు రాష్ట్రాలు ఎక్కువ జుట్టును ఎగుమతి చేస్తున్నాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..