ఒక చిన్న పొరపాటు..! రూ.1.65 కోట్ల ఫోన్ బిల్లు చూసిన మహిళకు ఫ్యూజులు అవుట్.. ఇంతకీ ఏమైందంటే..
తన ఫోన్ బిల్లు చూసిన ఆ మహిళ షాక్‌కు గురైంది. ఎందుకంటే ఏకంగా ఆమెకు రూ.1.65 కోట్ల ఫోన్ బిల్లు వచ్చింది. బిల్లు చూసిన ఆ మహిళకు కళ్లు బైర్లు కమ్మేసినంత పనై తల పట్టుకుంది. అది తను కలలో కూడా అనుకోలేదని, ఊహించని విధంగా భారీ మొత్తంలో వచ్చిన బిల్లుపై బాధితురాలు తన సర్వీస్ ప్రొవైడర్ T-Mobileకి కాల్ చేసింది. కాగా, సదరు టి- మొబైల్ సంస్థ కూడా బిల్లు సరైనదేనని వాదించింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..
చాలా సార్లు ఇంట్లో ఫోన్ , కరెంటు బిల్లులు కాస్త ఎక్కువ వస్తే ఖర్చులను అదుపు చేయడం మొదలుపెడతాం. ఇది మన బడ్జెట్ దెబ్బతినకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా పాటిస్తుంటాం. అయితే అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన సెలీనా అనే మహిళకు వచ్చిన ఫోన్ బిల్లు చూసి ఆమె కాళ్ల కింద నుంచి నేల జారిపోయినట్లయింది. తన ఫోన్ బిల్లు చూసిన ఆ మహిళ షాక్‌కు గురైంది. ఎందుకంటే ఏకంగా ఆమెకు రూ.1.65 కోట్ల ఫోన్ బిల్లు వచ్చింది. బిల్లు చూసిన ఆ మహిళకు కళ్లు బైర్లు కమ్మేసినంత పనై తల పట్టుకుంది. అది తను కలలో కూడా అనుకోలేదని, ఊహించని విధంగా భారీ మొత్తంలో వచ్చిన బిల్లుపై సెలీనా తన సర్వీస్ ప్రొవైడర్ T-Mobileకి కాల్ చేసింది. కాగా, సదరు టి- మొబైల్ సంస్థ కూడా బిల్లు సరైనదేనని వాదించింది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..
వాస్తవానికి ఈ బిల్లు $201,000 అంటే రూ. 1.65 కోట్లు. టెక్స్ట్, డేటా కమ్యూనికేషన్‌పై ఆధారపడిన వికలాంగులైన తన ఇద్దరు సోదరులతో సెలీనా తన ఫోన్ బిల్లును పంచుకునేది. అయినప్పటికీ అతని ఫోన్ బిల్లు సాధారణంగా గరిష్టంగా £130 (రూ. 13,715.14)కి వచ్చేది. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో బిల్లు రావటం చూసిన సెలీనా కంపెనీ ప్రతినిధులను నిలదీసింది. ఇలా ఎలా వేస్తారంటూ గట్టిగానే ప్రశ్నించింది.
అయితే, బిల్లును సరిచేయడానికి సెలీనా తన సర్వీస్ ప్రొవైడర్ T-Mobileకి కాల్ చేసింది. కాగా, టి-మొబైల్ బిల్లు సరైనదేనని వాదించింది. తన బిల్లు $200,000 (రూ. 1.62 కోట్లు) దాటినప్పుడు కంపెనీ తనకు తెలియజేయడంలో విఫలమైందని సెలీనా పేర్కొన్నప్పటికీ, T-Mobile ఆమెను పట్టించుకోలేదు. దాంతో బాధితురాలు మీడియాను ఆశ్రయించింది. మీడియా సంస్థ జోక్యం చేసుకోవడంతో సెలీనా ఉపశమనం పొందింది. ఆ తర్వాత బిల్లును 2,500 డాలర్లకు (రూ. 2.05 లక్షలు) తగ్గించి, చెల్లించేందుకు ఆరు నెలల గడువు ఇచ్చేందుకు ఫోన్ కంపెనీ అంగీకరించింది.
అయితే ఇంత ఎక్కువ బిల్లు కరెక్ట్ అయితే ఎలా వచ్చిందనేది ప్రశ్న. వాస్తవానికి, సెలీనా సోదరులు ఇద్దరూ యునైటెడ్ స్టేట్స్ నుండి కెనడాకు ఒక వారం పాటు వచ్చినప్పుడు, వారు ఇంటర్‌నేషనల్ కాల్స్ మాట్లాడుకోవాల్సి వచ్చింది. అలా వారు వినియోగించిన భారీ మొత్తం డేటా రెండింటికీ ఛార్జీ విధించారు. నివేదిక ప్రకారం..వారు విదేశీ వినియోగానికి సంబంధించిన షరతులు, పరిమితులను చదవలేదు.
మూలాల ప్రకారం, ఆమె సోదరులు 2,000కి పైగా టెక్స్ట్‌లు, వీడియోలను డౌన్‌లోడ్ చేసారు. దీని కోసం ఆమెకు డేటా ఛార్జీలకే £15,000 (రూ. 15.83 లక్షలు) ఖర్చు అయింది. ఫోన్ బిల్లు రాగానే, సెలీనా షాక్ అయ్యింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..