విమానంలో వింత సంఘటన.. ఫ్లైట్ ఎక్కిన వెంటనే రూ.15000 విలువైన పల్లీలు కొనేసిన మహిళ.. కారణం తెలిస్తే కంగు తింటారు..

సిబ్బంది తన మాట వినలేదని, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోలేదని ఆమె వాపోయింది. ఈ పరిస్థితుల్లో ఆమెకు మరో మార్గం లేకపోయింది. ఇక లాభం లేదని భావించి.. విమానంలోని మొత్తం అన్ని వేరుశెనగలు తనే కొనేసింది. దీంతో విలియమ్స్‌ విమానంలో అందుబాటులో ఉన్న పల్లీల ప్యాకెట్లన్నింటినీ కోనుగోలు చేసింది. ఒ‍క్కో ప్యాకెట్‌ మూడు యూరోలు అంటే సుమారు రూ.200 చొప్పున మొత్తం 45 ప్యాకెట్లను కొనుగోలు చేసింది.

విమానంలో వింత సంఘటన.. ఫ్లైట్ ఎక్కిన వెంటనే రూ.15000 విలువైన పల్లీలు కొనేసిన మహిళ.. కారణం తెలిస్తే కంగు తింటారు..
Peanuts Benefits
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 13, 2023 | 12:21 PM

చాలా సార్లు ప్రజలు తమ సౌలభ్యం కోసం మాత్రమే బహిరంగ ప్రదేశాల్లో ఏదైనా చేస్తారు. కానీ, ఇలాంటి పనులు చేస్తారని ఎవరూ ఊహించలేరు. కొందరికీ కారులో వెళ్తున్నప్పుడు ఏసీ, పర్‌ఫ్యూమ్‌ స్మెల్‌ వంటివి పడవు.. దాంతో వారు ఆ రెండిటీని కంట్రోల్‌ చేయమని అడుగుతుంటారు. అయితే, తాజాగా జర్మనీ నుంచి లండన్‌కు విమానంలో వెళ్తున్న 27 ఏళ్ల లియా విలియమ్స్ కూడా అలాంటి పనే చేసింది. అయితే, ఆమె కారులోనో, బస్సులోనో వెళ్లటం లేదు.. ఫ్లైట్‌లో వెళ్తుంది. దాంతో ఆమె ఫ్లైట్‌ ఎక్కిన వెంటనే.. అందులోని వేరుశెనగ ప్యాకెట్లన్నీ కొనేసింది. సాధారణంగా ప్రయాణ సమయంలో ప్రజలు స్నాక్స్ తింటూ ఉంటారు. అంతుకోసం పల్లీలు, బఠాణీలు, సమోసా, పాప్‌కార్న్‌ వంటివి కొనుగోలు చేస్తుంటాయి.  కానీ, లియా 15000 రూపాయ ల విలువైన పల్లీలు కొనటం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఆ మహిళ ఒక్కసారిగా రూ.15 వేల విలువైన వేరుశెనగ ప్యాకెట్లు కొనుగోలు చేయడం అందరిలోనూ విస్మయం కలిగించింది. ఇంకా విచిత్రం ఏటంటే, లేహ్ ఈ వేరుశెనగలను తినడానికి కొనుక్కోలేదు, కానీ, ఎవరూ కొనలేనంత ఎక్కువ మొత్తంలో వాటిని కొనిపెట్టుకుంది. చుట్టుపక్కల ఎవరైన వేరుశెనగలు కావాలంటే దొరక్క ఇబ్బంది పడ్డారు. అయితే, దీని వెనుక ఓ బలమైన కారణం ఉందని ఆ తర్వాత తెలిసింది.

వాస్తవానికి, లేహ్‌కు అనాఫిలాక్టిక్ షాక్ సమస్య ఉంది. ఇది తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య. ఇది అప్పుడప్పుడూ ప్రాణాంతకం కూడా కావచ్చు.ఈ అలెర్జీ వల్ల లేహ్ చుట్టూ ఉన్న వేరుశెనగ ప్యాకెట్ కూడా ఆమె ప్రమాదకరంగా ఉంటుంది. సాధారణంగా లేహ్‌ విమానంలో వెళ్లినప్పుడు, అక్కడ ఎవరూ వేరుశెనగ తినకుండా దాని గురించి ప్రకటన చేయమని సిబ్బందిని కోరుతుంది. కానీ, ఈసారి విమాన ప్రయాణం ప్రారంభించే ముందు ఆమె ఫ్లయిట్‌ క్యాబిన్‌ క్రూతో తనకున్న ఎలర్జీ గురించి చెప్పింది. ఇతరులు పల్లీలు తిన్నప్పుడు కూడా తనకు ఇబ్బంది కలుగుతుందని చెప్పింది. అందుకే ఫ్లైట్‌లోని ప్రయాణికులేవరూ పల్లీలు తినకుండా చూడాలని కోరింది. అయితే సిబ్బంది అందుకు నిరాకరించడంతో పాటు ఎయిర్‌లైన్స్ విధానానికి విరుద్ధమని చెప్పారు.

ఇవి కూడా చదవండి

సిబ్బంది తన మాట వినలేదని, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోలేదని ఆమె వాపోయింది. ఈ పరిస్థితుల్లో ఆమెకు మరో మార్గం లేకపోయింది. ఇక లాభం లేదని భావించి.. విమానంలోని మొత్తం అన్ని వేరుశెనగలు తనే కొనేసింది. దీంతో విలియమ్స్‌ విమానంలో అందుబాటులో ఉన్న పల్లీల ప్యాకెట్లన్నింటినీ కోనుగోలు చేసింది. ఒ‍క్కో ప్యాకెట్‌ మూడు యూరోలు అంటే సుమారు రూ.200 చొప్పున మొత్తం 45 ప్యాకెట్లను కొనుగోలు చేసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!