AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూపర్‌ మార్కెట్లో కొన్న బచ్చలికూర ప్యాకెట్‌లోంచి బేక బేక మంటూ వింత శబ్ధాలు..ఓపెన్‌ చేసిన మహిళ పరుగో పరుగు..

ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లుగా సంబంధిత సంస్థ తెలిపింది. కస్టమర్‌తో స్వయంగా మాట్లాడి జరిగిన తప్పుకు వివరణ ఇచ్చుకున్నట్టుగా కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆహార భద్రత, వినియోగదారుల అనుభవం తమకు ప్రధాన ప్రాధాన్యతలు అన్నారు. ఇది ఎలా జరిగిందో తెలియదని, భవిష్యత్తులో దీనిని ఎలా నిరోధించాలో మేము పరిశీలిస్తున్నామమని చెప్పారు.

సూపర్‌ మార్కెట్లో కొన్న బచ్చలికూర ప్యాకెట్‌లోంచి బేక బేక మంటూ వింత శబ్ధాలు..ఓపెన్‌ చేసిన మహిళ పరుగో పరుగు..
Live Frog In Packet
Jyothi Gadda
|

Updated on: Aug 13, 2023 | 12:51 PM

Share

అప్పుడప్పుడు తాజా ఆకుకూరల్లో చిన్న చిన్న పాములు, కప్పలు కనిపిస్తుంటాయి. అలాంటి వార్తలు సోషల్ మీడియాలో కూడా వైరల్‌ అవుతుంటాయి. చాలా సార్లు సూపర్ మార్కెట్ నుండి ప్యాక్డ్ ఫుడ్ లేదా ఏదైనా వస్తువులను కొనుగోలు చేసినప్పుడు.. వాటిల్లో కూడా ఊహించని వస్తువులు, బల్లులు, బొద్దింకలు కనిపిస్తుంటాయి. అప్పుడు ప్రజలు దుకాణదారుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. పప్పులో గులకరాళ్లు, పండ్లు, కూరగాయల్లో కుళ్ళినవి వంటివి కనిపిస్తుంటాయి. అయితే, ఇటీవల ఓ మహిళ దుకాణంలో సీల్డ్ ప్యాక్ చేసిన బచ్చలి కూరను కొనుగోలు చేయగా లోపల కనిపించిన సీన్‌ చూసి ఆమె షాక్‌కు గురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే…

ఈ ఘటన మిచిగాన్‌కు చెందినదిగా తెలిసింది. ఇక్కడ అంబర్ వారిక్ మార్కెట్ నుండి ఆర్గానిక్ బచ్చలి కూరను కొని ఇంటికి తీసుకువచ్చింది ఓ మహిళ. అంతలోనే తన కుమార్తె తల్లి తెచ్చిన బచ్చలికూర ప్యాకెట్‌ చూసి ఒక్కసారిగా కేకలు వేసింది. అది విన్న తల్లి కంగారుపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చింది..తీరా చూస్తే.. సీల్ చేసిన బచ్చలి కూర ప్యాకెట్‌లో బచ్చలికూరతో పాటు ఒక కప్ప కూడా కనిపించింది.

ఇవి కూడా చదవండి
Live Frog In Packet 1

Live Frog In Packet

దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ ఇంటిల్లిపాది ప్యాకెట్‌ చేతిలో పట్టుకుని కోపంతో దుకాణానికి చేరుకున్నారు. ఇదేంటని దుకాణ దారునిడి నిలదీయగా.. సదరు యజమాని క్షమాపణలు చెప్పి డబ్బును తిరిగి ఇచ్చాడు. ఆ తర్వాత ప్యాకెట్‌నుంచి కప్పను బయట విడిచిపెట్టామని దుకాణదారుడు తెలిపారు. ఇలాంటి ఉత్పత్తులు పంట పొలాల నుండి నేరుగా దుకాణాలకు వస్తుంటాయి. ఈ క్రమంలోనే అక్కడ నుండి ఈ రకమైన పొరపాటు జరిగి ఉంటుందని వారు వివరించారు.

ఎర్త్‌బౌండ్ ఫార్మ్స్ మాతృ సంస్థ టేలర్ ఫామ్స్ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది. కస్టమర్‌తో స్వయంగా మాట్లాడి జరిగిన తప్పుకు వివరణ ఇచ్చుకున్నట్టుగా కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆహార భద్రత, వినియోగదారుల అనుభవం తమకు ప్రధాన ప్రాధాన్యతలు అన్నారు. ఇది ఎలా జరిగిందో తెలియదని, భవిష్యత్తులో దీనిని ఎలా నిరోధించాలో మేము పరిశీలిస్తున్నామమని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..