AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GHMC: టీఆర్‌ఎస్‌, బీజేపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం.. జీహెచ్ఎంసీ పాలక మండలి స‌మావేశం ర‌సాభాస‌..

GHMC Council general body Meeting: టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్పొరేటర్ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. సమావేశం ప్రారంభం కాగానే తెలంగాణ సాయుధ పోరాట యోధులకు పాలకమండలి నివాళులర్పించింది. నివాళులర్పించే..

GHMC: టీఆర్‌ఎస్‌, బీజేపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం.. జీహెచ్ఎంసీ పాలక మండలి స‌మావేశం ర‌సాభాస‌..
Ghmc
Sanjay Kasula
|

Updated on: Sep 20, 2022 | 8:00 PM

Share

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (GHMC) కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. టీఆర్‌ఎస్‌(TRS), బీజేపీ(BJP) సభ్యుల వాదనలు- వాగ్వాదాలతో సభ పలు మార్లు వాయిదా పడింది. మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్పొరేటర్ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. సమావేశం ప్రారంభం కాగానే తెలంగాణ సాయుధ పోరాట యోధులకు పాలకమండలి నివాళులర్పించింది. నివాళులర్పించే ముందు బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. సమైక్యతా దినోత్సవం కాదని.. విమోచన దినోత్సవమని అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఆ తర్వాత సద్దుమణిగిన గొడవ మళ్లీ మొదలయింది. నగరంలో SNDP కింద చేపట్టిన పనులపై సమావేశంలో రగడ మొదలైంది. పనులు నత్తనడకన సాగుతున్నాయని.. బకాయిలు వెంటనే విడుదల చేయాలని పలువురు కార్పొరేటర్లు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌కు చెందిన ఉప్పల్‌ కార్పొరేటర్‌ రజిత మాట్లాడుతూ హైదరాబాద్‌లో వర్షం వస్తే ప్రజలకు నరకమేనని.. మీరేం అభివృద్ధి చేశారో వర్షం వస్తే తెలుస్తోందని ఎద్దేవా చేశారు.

బీజేపీ కార్పొరేటర్లు కొంతమంది టీఆర్‌ఎస్‌లో చేరిన అంశంపై సమావేశంలో కాసేపు గొడవ జరిగింది. ఈ క్రమంలో బీజేపీ కార్పొరేటర్లు మేయర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. అనంతరం బోరబండ కార్పొరేటర్‌ బాబా ఫసియుద్దీన్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ సిద్ధాంతాలు నచ్చే వారంతా చేరారని చెప్పగా.. బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం తెలిపారు.

అంతకు ముందు.. ఓ సారి కరెంట్‌ చార్జీలపై కూడా సభలో గొడవ జరిగింది. కరెంట్‌ ఛార్జీలు భారీగా పెంచారని బీజేపీ చేసీన ఆరోపణలపై టీఆర్‌ఎస్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని ఆదేశించిందని టీఆర్‌ఎస్‌ ఆరోపించింది. దీంతో రెండు పార్టీల సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. సభలో అంతా గందరగోళంగా మారడంతో సభను మేయర్‌ వాయిదా వేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం