AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ACB: ఏసీబీకి చిక్కిన ‘బుల్లెట్ బండి’ ఫేమ్ అశోక్.. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు..

Bullet Bandi Song Fame Ashok : బుల్లెట్ బండి సాంగ్ ఫేమ్ అశోక్ ఏసీబీకి చిక్కాడు. రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరకిపోయాడు అశోక్.

ACB: ఏసీబీకి చిక్కిన ‘బుల్లెట్ బండి’ ఫేమ్ అశోక్.. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు..
badangpet town planning officer
Sanjay Kasula
|

Updated on: Sep 20, 2022 | 7:02 PM

Share

Badangpet Town Planning Officer: బుల్లెట్ బండి సాంగ్ ఫేమ్ అశోక్ ఏసీబీకి అడ్డంగా దొరికిపోాయాడు. రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు అశోక్. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సూప‌ర్‌వైజ‌ర్‌గా పనిచేస్తున్నఅశోక్.. ఓ ఇంటి పర్మిషన్ కోసం రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీనిపై బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారు ఇచ్చిన సలహాతో వలపన్ని అశోక్‌ను పట్టుకున్నారు. గతంలో బుల్లెట్ బండి సాంగ్‌తో అతను సోషల్ మీడియాలో హల్ చల్ చేశాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ ఆఫీస్‌లో ఏసీబీ దాడులు చేశారు.

రూ. 30 వేలు లంచం తీసుకుంటుండ‌గా అశోక్‌ను ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. ఇంటి నిర్మాణ అనుమ‌తి కోసం స‌రూర్‌న‌గ‌ర్‌కు చెందిన బాధితుడు అశోక్‌ను సంప్ర‌దించాడు. మ‌ధ్య‌వ‌ర్తి ప్ర‌యివేటు ఆర్కిటెక్చ‌ర్  శ్రీనివాస్ రాజు ద్వారా అశోక్ రూ. 30 వేలు లంచం డిమాండ్ చేయ‌డంతో బాధిత వ్య‌క్తి ఏసీబీ అధికారుల‌ను ఆశ్ర‌యించాడు. దీంతో మంగళవారం అశోక్ లంచం తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు.

అశోక్‌తో పాటు శ్రీనివాస్ రాజును కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం మున్సిప‌ల్ కార్యాల‌యంతో పాటు అశోక్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం