Governor Tamilisai: వసతులు సరిగ్గా లేవు.. ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన గవర్నర్‌ తమిళిసై..

Governor Tamilisai: ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై ప్రభుత్వానికీ గవర్నర్‌ తమిళిసై కీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందరారాజన్‌ ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు.

Governor Tamilisai: వసతులు సరిగ్గా లేవు.. ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన గవర్నర్‌ తమిళిసై..
Governor Tamilisai
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 03, 2023 | 3:39 PM

Governor Tamilisai: ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై ప్రభుత్వానికీ గవర్నర్‌ తమిళిసై కీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందరారాజన్‌ ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు. ఉస్మానియా నూతన భవన నిర్మాణాన్ని వీలైనంత త్వరగా చేపట్టాలంటూ గతంలో ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్న గవర్నర్‌ తమిళసై.. ఇప్పుడు నేరుగా ఉస్మానియా ఆసుపత్రిని విజిట్‌ చేశారు. ఈ సందర్భంగా తమిళిసై బిల్డింగ్‌ నిర్మాణం తదితర వివరాలను అడిగితెలుసుకున్నారు. బిల్డింగ్‌ పరిస్థితిని డిప్యూటీ అధికారులు గవర్నర్‌ కు వివరించారు. అనంతరం తమిళిసై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను కలిసి వారితో మాట్లాడారు. సౌకర్యాలు, వైద్యం అందుతున్న తీరు.. పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో వసతులు సరిగ్గా లేవంటూ పేర్కొన్నారు. న్యూరో వార్డులో పైకప్పు కూడా లేదంటూ గవర్నర్‌ తమిళ సై కీలక వ్యాఖ్యలు చేశారు.

గతంలో ఉస్మానియా నూతన భవన నిర్మాణాన్ని వీలైనంత త్వరగా చేపట్టాలంటూ ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్న గవర్నర్‌ తమిళిసై.. ఇప్పుడు నేరుగా ఆసుపత్రిని విజిట్‌ చేయడం ఆసక్తికరంగా మారింది. గతంలో గవర్నర్‌ చేసిన ట్వీట్‌కి మంత్రి హరీష్‌రావు కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణలో జరిగే అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు మంత్రి హరీష్‌రావు. ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు మంత్రి. కోర్టు పరిధిలో ఉండడం వల్ల సైలెంట్‌గా ఉన్నామని మంత్రి పేర్కొన్నారు.

ఇప్పటికే ఉస్మానియా నూతన భవన నిర్మాణంపై గవర్నర్‌ వర్సెస్‌ ప్రభుత్వం ఇష్యూ కాకరేపుతోంది. ఉస్మానియా నూతన భవనం నిర్మాణం డిమాండ్ చేస్తూ జస్టిస్ ఫర్ OGH పేరు తో ఇండియన్ పోస్ట్ ద్వారా 8 వందల లెటర్లతో లేఖల ఉద్యమం నడుస్తోంది. CMO అడ్రెస్ తో 400 లెటర్లు పోస్ట్‌ చేశారు. చీఫ్ట్ జస్టిస్ హై కోర్టు అడ్రెస్ తో మరో 400 లేఖలు పోస్ట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

ఉస్మానియాలో తమిళిసై పర్యటిస్తున్న వేళ.. మరోవైపు ఉస్మానియా వైద్యులతో సచివాలయంలో మంత్రి హరీష్‌రావు సమీక్షిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!