Sonia Gandhi: ఫుల్ జోష్‌లో టీకాంగ్రెస్.. మేనిఫెస్టోను విడుదల చేయనున్న సోనియా గాంధీ.. ఎప్పుడంటే..
Telangana Congress Manifesto: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయముంది. దీంతో ప్రధాన పార్టీలను వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటినుంచే ప్రజల్లో ఉండేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి.
Telangana Congress Manifesto: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయముంది. దీంతో ప్రధాన పార్టీలను వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటినుంచే ప్రజల్లో ఉండేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. మూడోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతుండంగా.. దానికి చెక్ పెట్టేందుకు ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ పలు ప్రణాళికలతో ముందుకుసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన జన గర్జన సభ సక్సెస్ అవ్వడంతో.. అదే జోరును కొనసాగించాలని అధిష్టానం భావిస్తోంది. కాంగ్రెస్.. రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ తర్వాత నిర్వహించిన జనగర్జన పార్టీలో జోష్ పెంచింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అదే జోష్ ను మున్ముందు కొనసాగించాలని భావిస్తోంది. దీనిలో భాగంగా డిసెంబర్‌లో జరిగే ఎన్నికలే టార్గెట్ గా పార్టీ హామీలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు అధిష్టానం నుంచి కూడా రాష్ట్ర నాయకత్వానికి పలు సూచనలు, సలహాలతోపాటు.. ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఇక ఆలస్యం చేయకుండా మేనిఫెస్టోను కూడా విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. మేనిఫెస్టోకి తుది మెరుగులు దిద్ది ఫైనల్ చేయాలని పార్టీ హైకమాండ్ ఆదేశించినట్లు పేర్కొంటున్నారు.
చేయూత పథకం లాంటి స్కీంలతోపాటు.. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ రూపొందించనుంది. తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను సోనియాగాంధీ విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణలో పర్యటించనున్న సోనియా గాంధీ.. అదేరోజు మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే అగ్రనేతల వరుస పర్యటనలు కూడా ఉండనున్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
కర్ణాటకలో విజయం అనంతరం.. ఫుల్ జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అదే జోష్ ను తెలంగాణలో కూడా కొనసాగించాలని చూస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..