Hyderabad: హైదరాబాద్‌లో పుస్తకాల పండగ.. 340 స్టాల్స్ ఏర్పాటు.. వారికి ఫ్రీ ఎంట్రీ
మధ్యాహ్నం2 గంటలల నుంచి రాత్రి 8.30 గంటల వరకు శని, ఆది, ఇతర సెలవు దినాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ బుక్ ఫెయిర్ కొనసాగుతుంది. పాఠశాల విద్యార్థులకు, జర్నలిస్టులకు గుర్తింపు కార్డు చూపితే ఉచిత ప్రవేశం ఉంటుంది.
ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా పుస్తకాల పండగకు హైదరాబాద్ నగరం ముస్తాబైంది. దేశంలోనే రెండో అతి పెద్ద పుస్తక ప్రదర్శన గురువారం (డిసెంబర్ 22) నుంచి ప్రారంభంకానుంది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సుమారు 340 స్టాల్స్‌తో జనవరి 1 వరకు ఈ పుస్తక ప్రదర్శన జరగనుంది. మధ్యాహ్నం2 గంటలల నుంచి రాత్రి 8.30 గంటల వరకు శని, ఆది, ఇతర సెలవు దినాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ బుక్ ఫెయిర్ కొనసాగుతుంది. పాఠశాల విద్యార్థులకు, జర్నలిస్టులకు గుర్తింపు కార్డు చూపితే ఉచిత ప్రవేశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి సుమారు 10 లక్షల మంది పాఠకులు వస్తారని బుక్ ఫెయిర్ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. మొదటి రోజు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డితో పాటు పత్రికల సంపాదకులు, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ హాజరుకానున్నారు. వారి చేతుల మీదుగానే బుక్ ఫెయిర్ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.
సీఎం పేరుతో స్పెషల్ స్టాల్..
కాగా 35వ బుక్ ఫెయిర్‌లో సీఎం కేసీఆర్ పేరిట కూడా ఓ ప్రత్యేక స్టాల్ కూడా ఏర్పాటు చేయనున్నారు. సీఎం కేసీఆర్ పై వివిధ రచయితలు రాసిన పుస్తకాలు, ఉద్యమ ప్రస్థానం, ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలకు సంబంధించిన పుస్తకాలను ఈ స్టాల్‌లో ప్రదర్శనగా ఉంచనున్నారు. అలాగే కేంద్ర హిందీ సంస్థాన్ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక స్టాల్ ఏర్పాటు కానుంది. ఇక వివిధ రకాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కావాల్సిన పుస్తకాలు కూడా ఇక్కడ లభించనున్నాయి. ఇక పుస్తక ప్రియులను అలరించేందుకు ప్రతిరోజూ సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..