హైదరాబాద్‏లో కఠినంగా లాక్‏డౌన్.. రాత్రి వేళలో చిన్నారిని రక్షించిన పోలీసులు.. ఆ పాప మాటలకు చలించిన ఖాకీలు..

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. దీంతో రాష్ట్రాలు కరోనాను కట్టిడి చేసేందుకు లాక్‏డౌన్ విధించాయి.

హైదరాబాద్‏లో కఠినంగా లాక్‏డౌన్.. రాత్రి వేళలో చిన్నారిని రక్షించిన పోలీసులు.. ఆ పాప మాటలకు చలించిన ఖాకీలు..
Hyderabad Police
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 02, 2021 | 11:01 PM

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. దీంతో రాష్ట్రాలు కరోనాను కట్టిడి చేసేందుకు లాక్‏డౌన్ విధించాయి. అయితే తెలంగాణలో సైతం కఠినంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఇదిలా ఉంటే.. రాజధాని హైదరాబాద్‏లో పగటి పూట అత్యవసర వాహనదారులు కొద్ది మంది తిరిగినా రాత్రిపూట మాత్రం రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. బయట కనిపించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనాతో పాటు పోలీసుల భయంతో ఏ ఒక్కరూ బయటికి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఓ ఏడేళ్ల చిన్నారి రోడ్డు మీద బిక్కుబిక్కు మంటూ పోలీసుల కంట పడింది.

గోల్కొండ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల మహేశ్వరి అమ్మ కొడుతుందంటూ ఇంటి నుండి బయటకు వచ్చేసి రోడ్లపై తిరుగుతుంది. లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీసుల కంట ఆ చిన్నారి పడింది. దీంతో ఆ బాలికను చేరదీసిన పోలీసులు వివరాలు అడిగారు. చిన్నారి చెప్పిన మాటలు విని ఒక్కసారిగా చలించి పోయారు. తన తల్లి ఏ కారణం లేకుండానే కొడుతుందని పోలీసుల వద్ద బావురుమంది మహేశ్వరి. దెబ్బలు భరించలేక ఇల్లు వదిలి వచ్చేసినట్టు చెప్పింది. అప్పటికే ఆకలితో ఆ బాలికకు పోలీసులు శానిటైజ్‌ చేసి చేతులు శుభ్రంగా కడిగారు. తమ దగ్గర ఉన్న అన్నం తినిపించారు. ఆ తర్వాత ఆ చిన్నారికి ఎలాంటి భయం అవసరం లేదని.. తన కష్టాలు తీరుస్తామని భరోసా ఇచ్చారు పోలీసులు.

వీడియో..

Also Read: మీ ఇంట్లో ఈ చెట్లు ఉంటే.. ఆరోగ్యంతోపాటు అదృష్టం కూడా మీ సొంతమే.. మొక్కలు ఏ దిశలో ఉంటే మంచిదో తెలుసా..

LICలో అదిరిపోయే పాలసీ.. రోజుకీ రూ.28 ఆదా చేస్తే రూ.2 లక్షల వరకు బెనిఫిట్.. వారికి మాత్రమే ఛాన్స్..

Mukesh Ambani: ఏడురోజుల్లోనే భారీగా పెరిగిన ముఖేష్ ఆదాయం.. త్వరలోనే టాప్ టెన్ ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా స్థానం..?

Work From Home: రిమోట్ పని నుంచి ఆఫీసు పనికి రావడానికి ఇష్టపడని ఉద్యోగులు..పాశ్చాత్య దేశాల్లో ఇబ్బందికర పరిస్థితి