AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaccination drive for Drivers : రేపటి నుంచే గ్రేటర్‌ హైదరాబాద్‌‌లో డ్రైవర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్‌.. పేర్లు నమోదు చేసుకోండిలా..

ఆర్టీసీ, ఆటో, కార్ల డ్రైవర్లు తెలంగాణ ట్రాన్స్ పోర్ట్ వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ లింక్ ద్వారా నమోదు చేసుకోవాలి.

Vaccination drive for Drivers : రేపటి నుంచే గ్రేటర్‌ హైదరాబాద్‌‌లో డ్రైవర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్‌.. పేర్లు నమోదు చేసుకోండిలా..
Covid 19 Vaccination To D
Venkata Narayana
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 16, 2022 | 1:13 PM

Share

RTC bus, auto, cab drivers to be vaccinated : రేపటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని వాహనాల డ్రైవర్లకు కరోనా వ్యాక్సిన్ వేయబోతున్నారు. ఇందుకోసం సదరు.. ఆర్టీసీ, ఆటో, కార్ల డ్రైవర్లు తెలంగాణ ట్రాన్స్ పోర్ట్ వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ లింక్ ద్వారా డ్రైవర్లు తమ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.  ఆన్ లైన్లో పైన చెప్పిన సైట్లోకి వెళ్లి డ్రైవర్లు తమ డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. కాగా, కరోనా సమయంలోనూ కుటుంబ పోషణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు బస్సు, ఆటో డ్రైవర్లు. కేసీఆర్ సర్కారుతో ఫ్రంట్ లైన్ వర్కర్ల హోదా పొందిన ఆటో డ్రైవర్లు ఈనెల 3వ తేదీ నుంచి కరోనా టీకాలు వేయించుకోవచ్చని ప్రకటించింది.

గ్రేటర్ హైదరాబాద్ లో సుమారు 2.50 లక్షల మందికి పైగా ఆటో డ్రైవర్లకు రేపటి నుంచి వ్యాక్సినేషన్‌ చేయబోతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆటో డ్రైవర్లు వ్యాక్సిన్‌ కోసం తమ పేర్లను సంబంధిత ఆర్టీఓల వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకుని టోకెన్లు పొందాలని టీఆర్‌ఎస్‌కేవీ ఆటో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య కూడా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ విషయాన్ని ట్రాన్స్‌పోర్ట్‌ ఉన్నతాధికారులు తెలియజేశారని ఆయన తెలిపారు. ఆటో డ్రైవర్లు తమ పేర్లను ఆర్టీఓ కార్యాలయాల్లో నమోదు చేసుకోవాలని సూచించారని చెప్పారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్‌ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, కరోనా మహమ్మారికి చిక్కకుండా ప్రాణాలు కాపాడుకోవాలని డ్రైవర్ల సంఘాలు కోరుతున్నాయి.

Read also : Kakani : ఆనందయ్య మందు కోసం దళారులను నమ్మి మోసపోకండని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి వినతి