Kakani : ఆనందయ్య మందు కోసం దళారులను నమ్మి మోసపోకండని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి వినతి

ఆనందయ్య ఆయుర్వేద మందుకు దళారులుగా వ్యవహరించి, సొమ్ము చేసుకోవాలని ఆలోచన చేస్తే, ఎంతటి వారికైనా కఠిన చర్యలు..

Kakani : ఆనందయ్య మందు కోసం దళారులను నమ్మి మోసపోకండని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి వినతి
Mla Kakani
Follow us

|

Updated on: Jun 02, 2021 | 8:48 PM

Anandayya medicine : ఆనందయ్య మందుకోసం దళారులను నమ్మి మోసపోకండని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి చెప్పారు. ఆనందయ్య ఆయుర్వేద మందుకు దళారులుగా వ్యవహరించి, సొమ్ము చేసుకోవాలని ఆలోచన చేస్తే, ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీ, పంపిణీ విషయంలో పూర్తి నిర్ణయాధికారం ఆనందయ్యదే తప్ప, ప్రభుత్వానికి గానీ, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి గానీ ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. వస్తు రూపంలో ఇవ్వడం కానీ, ఆర్థిక సహాయం అందించాలన్న వారు గానీ వారు నేరుగా ఆనందయ్యకు తప్ప, మధ్యలో మరెవ్వరికీ, ఎంతటివారినైనా నమ్మి ఇవ్వవద్దని మనవి చేస్తున్నానని కాకాని తెలిపారు. కాగా, ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన నేపథ్యంలో నెల్లూరుజిల్లా కృష్ణపట్నంలో కరోనా నివారణ ఔషద తయారీకి ఇవాళ ఏర్పాట్లను మొదలు పెట్టారు. జిల్లా అధికారుల సూచనల మేరకు కృష్ణపట్నం పోర్టులోని సెక్యూరిటీ అకాడమీ ప్రాంగణంలో ఔషదం తయారీకి ఏర్పాట్లు చేసుకున్నారు ఆనందయ్య. ఇవాళ అకాడమీ ప్రాంగణంలో మందు తయారీ కోసం ప్రత్యేకంగా తాత్కాలిక షెడ్ ను నిర్మిస్తున్నారు.

ఈ షెడ్ నిర్మాణం కోసం ఆనందయ్య భూమి పూజ చేశారు. భగవాన్ వెంకయ్య స్వామి శిష్యుడు ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు రోజుల్లో షెడ్ నిర్మాణం.. ఇతర సదుపాయాల కల్పన పూర్తవుతుంది. తర్వాత అక్కడే మందు తయారీని మొదలు పెట్టి… సోమవారం నుండి పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు ఆయన మందు పనిచేస్తుందా? లేదా? అన్నదే చర్చ. అందరి అనుమానాల్ని, సందేహాల్ని పటాపంచల్ చేస్తూ హైకోర్టు లైన్ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో మందు తయారిపై గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న వివాదానికి నిన్నటితో తెరపడింది. ఇక తయారి సంగతి పక్కన పెడితే.. మందు పంపిణిపై కూడా జనాల్లో కొత్త డౌట్‌లు కలుగుతున్నాయి. అసలు ఆనందయ్య మందు ప్రజలకు ఏ మార్గంలో అందుతుంది? ఇదే ఇప్పుడు హాట్‌ టాపిగ్‌గా మారింది.

కరోనాను నయం చేసేందుకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య మందు తయారికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటే.. ప్రభుత్వం మాత్రం అందుకు అభ్యంతరం తెలిపింది. ఆనందయ్య తోటలో కాకుండా… మందును కృష్ణపట్నం పోర్టులో తయారు చేయాలని నిర్ణయించింది. బహిరంగ ప్రదేశంలో మందు తయారు చేయడం సరికాదనే వాదనను వినిపించింది. పోర్టులోని సీవీఆర్‌ ఫౌండేషన్‌లో మందు తయారు చేయాలని సూచించారు అధికారులు. తోటలో మందు తయారీ చేయడం సెంటిమెంట్‌గా ఫీలవుతున్నట్లు ఆనందయ్య చెప్పినప్పటికి … అధికారులు తాము సూచించిన ప్రదేశంలోనే మందు తయారు చేయాలని పట్టుబట్టారు. అయితే చిట్ట చివరికి కృష్ణపట్నం పోర్టులోని సెక్యూరిటీ అకాడమీ ప్రాంగణంలో ఔషదం తయారీకి ఆనందయ్య అంగీకరించారు. దీంతో ఇవాళ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న షెడ్డూకు భూమి పూజలు నిర్వహించారు.

Read also : Corona free village : మీ గ్రామాన్ని ‘కరోనా ఫ్రీ’గా చేసుకోండి, రూ. 50 లక్షలు బహుమతి పొందండి.. మహారాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రకటన