మీ ఇంట్లో ఈ చెట్లు ఉంటే.. ఆరోగ్యంతోపాటు అదృష్టం కూడా మీ సొంతమే.. మొక్కలు ఏ దిశలో ఉంటే మంచిదో తెలుసా..

ఇంటి ముందు అందమైన మొక్కలు ఉంటే.. ఇళ్లు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. అంతేకాదు.. ఇంటి ముందు ఖాళీ స్థలంలో చెట్లు ఉండడం

మీ ఇంట్లో ఈ చెట్లు ఉంటే.. ఆరోగ్యంతోపాటు అదృష్టం కూడా మీ సొంతమే.. మొక్కలు ఏ దిశలో ఉంటే మంచిదో తెలుసా..
Plants
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 02, 2021 | 10:24 PM

ఇంటి ముందు అందమైన మొక్కలు ఉంటే.. ఇళ్లు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. అంతేకాదు.. ఇంటి ముందు ఖాళీ స్థలంలో చెట్లు ఉండడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరవు. అలాగే స్వచ్చమైన గాలిని కూడా అందిస్తాయి. ఉదయాన్నే మొక్కలు చూడడం.. వాటితో కాసేపు గడపడం వలన ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అందం, ఆరోగ్యం మాత్రమే కాకుండా.. కొన్ని మొక్కలు అదృష్టాన్ని కూడా అందిస్తాయి. ఇంట్లో రకారకాల మొక్కలను పెంచుతుంటారు. అయితే కొన్ని మొక్కలను సవ్యదిశలో పెట్టడం వలన అదృష్టం కలిగి వస్తుంది. అయితే ఏ ఏ మొక్కలు అదృష్టాన్ని అందిస్తాయి.. ఏఏ దిశలో నాటాలో తెలుసుకుందామా.

షమీ చెట్టు వ్యాధులను నయం చేస్తుంది… షమీ చెట్టును ఎక్కువగా శని దేవుడి ప్రియమైన మొక్కగా భావిస్తారు. ఈ చెట్టు ఇంటి ముందు పెట్టి ప్రతిరోజూ పూజించాలి. షమీ చెట్టు ఇంట్లో ఉంటే వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే అప్పుల బాధలు తొలగిపోతాయి.

మనీ ప్లాంట్.. మనీ ప్లాంట్ ను లక్షీ దేవి స్వరూపంగా భావిస్తారు. ఇంట్లో ఈ మొక్క ఉంటే లక్ష్మీ దేవి ఆనందిస్తుంది అంటారు. అలాగే అనారోగ్య సమస్యలు తొలగిపోవడమే కాకుండా.. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. దీనిని ఆగ్నేయ దిశలో నాటాలి.

జాడే ప్లాంట్.. గుండ్రని ఆకులు కలిగిన జాడే ప్లాంట్ ను చాలా పవిత్ర చెట్టుగా భావిస్తారు. ఈ మొక్కను ఇంటి గుమ్మానికి కుడివైపు ఉంచాలి. అలాగే ఇది ఒక మీటరు కంటే ఎక్కువగా పెరగకూడదు. జాడే మొక్క ఇంట్లో ఉంటే.. సమస్యలు తొలగిపోయి.. సంపద పెరుగుతుంది. ఇది పనిచేసే చోట కూడా ఉండవచ్చు.

తులసి చెట్టు.. తులసి చెట్టును కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. ఇది ఇంట్లో ఉంటే.. ప్రతికూల సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తుంటారు. ఇవే కాకుండా.. ఈ చెట్టు ఆకులను జలుబు, దగ్గు వంటి వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. తులసి చెట్టు ఎప్పుడూ దక్షిణ దిశలో ఉండాలి.

జంబు చెట్టు.. వాస్తు ప్రకారం వెదురు మొక్కలను చాలా పవిత్రంగా భావించాలి. ఫెంగ్ షూయ్ లో అదృష్టాన్ని అందిస్తుంది. అందుకే దీనిని లక్కీ ట్రీ అంటారు. ఫెంగ్ షుయ్ ప్రకారం, ఇంట్లో లేదా కార్యాలయంలో ఎర్రటి దారంతో కట్టబడిన వెదురు మొక్కల కట్టను ఉంచడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంద. ఇంటి సభ్యుల జీవితాన్ని కూడా పెంచుతుంది. కానీ మీరు ఈ మొక్కను నాటిన కుండ లేదా కుండలో నీటితో పాటు రాళ్ళు ఉండాలి అని గుర్తుంచుకోండి.

Also Read: Shreya Ghoshal: మొదటిసారిగా కొడుకు ఫోటో షేర్ చేసిన సింగర్ శ్రేయా ఘోషల్ దంపతులు.. తనయుడి పేరు ఇంట్రడ్యూస్..

Juhi Chawla: హైకోర్టులో విచారణ… నటి జూహీ చావ్లాను చూసి పాటలు పాడిన ఆకతాయి.. సీరియస్ అయిన జడ్జి ఏం చేశాడంటే..