AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shreya Ghoshal: మొదటిసారిగా కొడుకు ఫోటో షేర్ చేసిన సింగర్ శ్రేయా ఘోషల్ దంపతులు.. తనయుడి పేరు ఇంట్రడ్యూస్..

Shreya Ghoshal:  ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషల్ మొదటి సారి తన కొడుకు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.. ఇటీవలే తనకు మగ బిడ్డ

Shreya Ghoshal: మొదటిసారిగా కొడుకు ఫోటో షేర్ చేసిన సింగర్ శ్రేయా ఘోషల్ దంపతులు.. తనయుడి పేరు ఇంట్రడ్యూస్..
Shreya Ghoshal
Rajitha Chanti
|

Updated on: Jun 02, 2021 | 9:35 PM

Share

Shreya Ghoshal:  ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషల్ మొదటి సారి తన కొడుకు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.. ఇటీవలే తనకు మగ బిడ్డ జన్మించినట్లు శ్రేయా ఘోషల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు తన బాబు ఫోటోలు కానీ.. తనకు సంబంధించిన ఏ విషయాన్ని శ్రేయా దంపతులు వెల్లడించలేదు. దీంతో శ్రేయా కుమారుడి ఫోటో కోసం ఆమె అభిమానులు ఎంతగానో వెయిట్ చేశారు. తాజాగా తన తనయుడి ఫోటోతోపాటు.. అతని పేరును కూడా శ్రేయా దంపతులు అభిమానులతో పంచుకున్నారు. అలాగే కొడుకు పుట్టిన తర్వాత తమ జీవితంలో జరిగిన పరిణామాలు.. ఫీలింగ్స్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

తన భర్త శిలాదిత్యతో కలిసి కలిసి తమ కుమారుడి ఎత్తుకొని ఉన్న ఫోటోను షేర్ చేసుకున్నార శ్రేయా. అలాగే తమ కుమారుడికి దేవ్యాన్ ముఖోపాధ్యాయ అని నామకరణం చేసినట్లుగా వెల్లడించారు. అయితే శ్రేయా దంపతులు తమ కుమారుడి ముఖం మాత్రం చూపించకుండా జాగ్రత్త పడ్డారు. తమ కుమారుడి ఫోటోను షేర్ చేస్తూ.. “ఇంట్రడ్యూసింగ్ దేవ్యాన్ ముఖోపాధ్యాయ.. తను మే 22న మా జీవితంలోకి వచ్చాడు. అతడి రాకతో గుండెలలో ఒక రకమైన ప్రేమను నింపాడు.. ఒక తల్లి, ఒక తండ్రి మాత్రమే ఇలాంటి మధురమైన అనుభూతిని పొందుతారు. స్వచ్చమైన.. హద్దులు లేని ప్రేమకు మా చిన్నారి దేవ్యాన్ నిదర్శనం” అంటూ శ్రేయా ట్వీట్ చేసింది. శ్రేయా దంపతుల కుమారుడి పేరు బాగుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ట్వీట్..

Also Read: Weight loss: ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తింటున్నారా ? అయితే జాగ్రత్త.. ఇవి తింటే కచ్చితంగా బరువు పెరుగుతారట..

Corona Third Wave: ఇప్పటి నుండీ సంసిద్ధం అయితే కరోనా మూడో వేవ్ పెద్ద ప్రమాదకారి కాదు.. ఎస్బీఐ పరిశోధనా పత్రంలో వెల్లడి

Walnuts: వాల్‌నట్స్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. కరోనా టైంలో ఇవి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!