LICలో అదిరిపోయే పాలసీ.. రోజుకీ రూ.28 ఆదా చేస్తే రూ.2 లక్షల వరకు బెనిఫిట్.. వారికి మాత్రమే ఛాన్స్..

LIC Insurance Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( LIC ) ఇప్పటికీ చాలా మంది విశ్వసిస్తుంటారు. అందుకే ఈ ఇందులో చాలా

LICలో అదిరిపోయే పాలసీ.. రోజుకీ రూ.28 ఆదా చేస్తే రూ.2 లక్షల వరకు బెనిఫిట్.. వారికి మాత్రమే ఛాన్స్..
Lic Insurance
Follow us

|

Updated on: Jun 02, 2021 | 9:58 PM

LIC Insurance Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( LIC ) ఇప్పటికీ చాలా మంది విశ్వసిస్తుంటారు. అందుకే ఈ ఇందులో చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటుంటారు. అలాగే ఎల్ఐసీ కూడా తమ కస్టమర్లకు కావల్సిన సమాచారాన్ని.. అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంది. అయితే ఇందులోని ఇన్సూరెన్స్ పాలసీల గురించి కొద్ది మందికి మాత్రమే పూర్తిగా తెలుసు. అలాగే చాలా వరకు ఇన్సూరెన్స్ పాలసీ గురించి తెలియనివారు ఉన్నారు. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావించే వారికి సూపర్ ఛాన్స్… ఎల్ఐసీ అదిరిపోయే పాలసీని అందిస్తోంది.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కోసం మైక్రో బచన్ ఇన్సూరెన్స్ పాలసీ అందిస్తోంది. తక్కువ ఆదాయం ఉన్నవారు ఈ పాలసీని తీసుకోవచ్చు. సేవింగ్స్, ప్రొటెక్షన్ రెండు ఈ పాలసీ ద్వారా పొందవచ్చు. అంతేకాకుండా.. ప్రమాదవశాత్తు పాలసీదారుడు చనిపోతే.. కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత లభిస్తుంది. పాలసీదారుడు మెచ్యూరిటీ సమయం వరకు జీవించి ఉంటే.. అప్పుడు వారికి పాలసీ డబ్బులు అందుతాయి. రూ.2 లక్షల వరకు బీమా మొత్తానికి ఈ పాలసీని తీసుకోవచ్చు. మూడు సంవత్సరాలు ప్రీమియం కట్టిన తర్వాత లోన్ ఫెసిలిటీ కూడా తీసుకోవచ్చు. అయితే ఈ పాలసీని 18 నుంచి 55 సంవత్సరాల లోపు వయసున్న వారు మాత్రమే తీసుకోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ టర్మ్ 10 నుంచి 15 సంవత్సరాలు ఉంటుంది. ఈ పాలసీకి నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున ప్రీమియం కట్టవచ్చు. 35 సంవత్సరాల వయసు ఉన్నవారు 15 ఏళ్ల టర్మ్ తో పాలసీ తీసుకుంటే రూ. 2 లక్షల బీమా మొత్తానికి సంవత్సరానికి రూ. 10,300 ప్రీమియం కట్టాలి. అంటే రోజుకీ రూ.28 ఆదా చేయాలన్న మాట.

Also Read: Weight loss: ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తింటున్నారా ? అయితే జాగ్రత్త.. ఇవి తింటే కచ్చితంగా బరువు పెరుగుతారట..

Slow Down While Eating: మీరు వేగంగా భోజనం చేస్తున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి.!