Petrol Prices Around The World: పెట్రోల్ ధరలు ఏయే దేశాల్లో తక్కువ? ఏయే దేశాల్లో ఎక్కువ? భారత్ ర్యాంకు ఎంతంటే?

Petrol prices around the world: దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో లీటరు పెట్రోల్ ధర సెంచరీ మార్క్‌ను దాటింది. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100ల పైకి చేరుకుంది.

Petrol Prices Around The World: పెట్రోల్ ధరలు ఏయే దేశాల్లో తక్కువ? ఏయే దేశాల్లో ఎక్కువ? భారత్ ర్యాంకు ఎంతంటే?
Petrol Price
Follow us

|

Updated on: Jun 02, 2021 | 6:29 PM

దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో లీటరు పెట్రోల్ ధర సెంచరీ మార్క్‌ను దాటింది. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100ల పైకి చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తుండగా…దీన్ని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు దేశాల్లో పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయి? ఏయే దేశాల్లో ధరలు అతి తక్కువగా ఉన్నాయి? ఏయే దేశాల్లో అతి ఎక్కువగా ఉన్నాయో? ఓ లుక్కేయండి. మే 24, 2021 నాటికి ఆయా దేశాల్లో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి. (ఇందులో 1 అమెరికా డాలర్‌ను రూ.72.87గా పరిగణించాలి)

పెట్రోల్ ధరలు అత్యంత తక్కువగా ఉన్న 5 దేశాలు… ప్రపంచంలో పెట్రోల్ ధరలు అత్యంత తక్కువగా ఉన్న దేశం వెనుజులా. ఆ దేశంలో లీటరు పెట్రోల్ ధర కేవలం 0.02 డాలర్ మాత్రమే. రెండో స్థానంలో ఇరాన్ నిలుస్తోంది. ఆ దేశంలో లీటర్ పెట్రోల్ 0.067 డాలర్ మాత్రమే. మూడో స్థానంలో ఉన్న దేశం అంగోలా. అక్కడ లీటరు పెట్రోల్ ధర 0.249 డాలర్. ఇక నాలుగో స్థానంలో నిలుస్తున్న అల్గేరియాలో లీటర్ పెట్రోల్ 0.344 డాలర్లుగా ఉంది. ఐదో స్థానంలో నిలుస్తున్న కువైట్‌లో లీటరు పెట్రోల్ ధర కేవలం 0.349 డాలర్లు మాత్రమే.

పెట్రోల్ ధరలు అత్యంత ఎక్కువగా ఉన్న 5 దేశాలు.. ప్రపంచంలో పెట్రోల్ ధరలు అత్యంత ఎక్కువగా ఉన్న టాప్ -5 దేశాల్లో హాంకాంగ్ మొదటి స్థానంలో నిలుస్తోంది. ఆ దేశంలో లీటరు పెట్రోల్ 2.485 డాలర్లుగా ఉంది. నెథర్లాండ్స్ రెండో స్థానంలో నిలుస్తోంది. ఆ దేశంలో లీటరు పెట్రోల్ 2.178 డాలర్లు. ఇక మూడో స్థానంలో నిలుస్తున్న నార్వేలో లీటర్ పెట్రోల్ 2.056 డాలర్లుగా ఉండగా…సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్(2.05 డాలర్లు) నాలుగో స్థానం, మొనాకో (2.003 డాలర్లు) ఐదో స్థానంలో నిలుస్తున్నాయి.

Petrol Price

Petrol Price

భారత్‌లో ఇలా… పెట్రోల్ ధరలు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 58వ స్థానంలో నిలుస్తోంది. మే 24తేదీన భారత్‌లో లీటర్ పెట్రోల్ ధర 1.31 డాలర్లుగా ఉంది.

ఇవి కూడా చదవండి..

పాలసీదారుడు తప్పిపోయినట్లయితే.. నామినీకి క్లెయిమ్ వస్తుందా.? పూర్తి వివరాలు.!

విదేశీ టీకాలపై కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం.. త్వరలో అందుబాటులోకి రానున్న మరిన్ని వ్యాక్సిన్లు..!