Foreign Covid Vaccines: విదేశీ టీకాలపై కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం.. త్వరలో అందుబాటులోకి రానున్న మరిన్ని వ్యాక్సిన్లు..!

భారత్‌లో విదేశీ టీకాల పంపిణీకి అడ్డంకులు తొలగిపోతున్నాయి. విదేశాల్లో అనుమతి పొందిన వ్యాక్సిన్లకు భారత్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ అవసరం లేదని కేంద్రం ప్రకటించింది.

Foreign Covid Vaccines: విదేశీ టీకాలపై కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం.. త్వరలో అందుబాటులోకి రానున్న మరిన్ని వ్యాక్సిన్లు..!
Foreign Covid Vaccines Approved By Dcgi
Follow us

|

Updated on: Jun 02, 2021 | 5:46 PM

Foreign Covid Vaccines in India: భారత్‌లో విదేశీ టీకాల పంపిణీకి అడ్డంకులు తొలగిపోతున్నాయి. విదేశాల్లో అనుమతి పొందిన వ్యాక్సిన్లకు భారత్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ అవసరం లేదని కేంద్రం ప్రకటించింది. ఇండియాలో వ్యాక్సినేష‌న్ ప్రక్రియ‌ను వేగ‌వంతం చేయ‌డంలో భాగంగా డ్రగ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కీల‌క నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వివిధ దేశాలు, డ‌బ్ల్యూహెచ్ అత్యవ‌స‌ర వినియోగానికి ఆమోదం పొందిన వ్యాక్సిన్లకు ఇండియాలో మ‌ళ్లీ ట్రయ‌ల్స్ అవ‌స‌రం లేద‌ని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఫైజ‌ర్‌, మోడెర్నాలాంటి వ్యాక్సిన్లకు లైన్ క్లియ‌ర్ కానుంది.

విదేశాల్లో అనుమతి పొందిన టీకాలకు భారత్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించకుండానే పంపిణీ చేసేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. తాజా ఈ నిర్ణయంతో ఫైజ‌ర్‌, మోడెర్నాలాంటి వ్యాక్సిన్లు భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు కంపెనీలు ఇప్పటికే న‌ష్టప‌రిహారం, ట్రయ‌ల్స్ నిర్వహించ‌డం వంటి వాటిని ఎత్తేయాల‌ని కోరాయి. దేశంలో వ్యాక్సిన్ల‌కు ఉన్న డిమాండ్‌, భారీగా పెరిగిపోతున్న కేసుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీసీజీఐ చీఫ్ వీజీ సోమానీ వెల్లడించారు.

మరోవైపు, భారత్‌కు వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు సిద్దంగా ఉన్నామని ఫైజర్‌ సంస్థ ప్రకటించింది. కేంద్రంతో ఈ విషయంపై చర్చలు జరుగుతున్నట్టు వెల్లడించింది. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ల కోసం ఏర్పాటు చేసిన నిపుణుల బృందం డీసీజీఐకి ఈ సిఫార‌సు చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది తీసుకున్న వ్యాక్సిన్లు, యూఎస్ ఎఫ్‌డీఏ, ఈఎంఏ, యూకే ఎంహెచ్ఆర్ఏ, పీఎండీఏ, జ‌పాన్ లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమ‌ర్జెన్సీ యూజ్ లిస్ట్‌లో ఉన్న వ్యాక్సిన్ల‌కు ఇండియాలో క్లినిక‌ల్ ట్రయ‌ల్స్ అవ‌స‌రం లేద‌ని నిర్ణయించారు. గ‌తంలో విదేశాల్లో ట్రయ‌ల్స్ పూర్తి చేసి అనుమ‌తి పొందిన వ్యాక్సిన్లు కూడా ఇండియాలో బ్రిడ్జింగ్ ట్రయ‌ల్స్ లేదా ప‌రిమిత స్థాయిలో క్లినిక‌ల్ ట్రయ‌ల్స్ నిర్వహించాల‌న్న నిబంధ‌న ఉండేది. ఇప్పుడా నిబంధ‌న‌ను ఎత్తేశారు.

ఇదిలావుంటే, అత్యంత కీలకమైన ఇండెమ్నిటి విషయంలో ఫైజర్‌, మోడర్నాల అభ్యర్థనను ప్రభుత్వం సానుకూల వైఖరితో పరిశీలిస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఫైజర్‌, మోడెర్నా టీకాలకు ఇండెమ్నిటి ఇచ్చిన దేశాలు ఎటువంటి సమస్యలు ఎదుర్కోలేదన్న విషయాన్ని ప్రభుత్వం గమనించింది. ‘‘ఈ కంపెనీలు అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకొంటే వెంటనే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని ఆ వర్గాలు వెల్లడించాయి.

Read Also…  Maoists Effected Corona: సెకండ్ వేవ్‌తో దేశాన్ని వణికిస్తోన్న కరోనా.. దండకారణ్యంలోనూ దడ పుట్టిస్తోందా?.. మావోయిస్టులకు మాయరోగం!

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..