Unlock: అప్పుడే అన్‌లాక్ వద్దు.. థర్డ్ వేవ్ గురించి కాస్త ఆలోచించండి: రాష్ట్రాలకు ఐసీఎంఆర్ సూచనలు
Covid-19 Third Wave - ICMR: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో కోవిడ్-19
Covid-19 Third Wave – ICMR: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ను విధించి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే.. ఇటీవల కేసుల సంఖ్య తగ్గుతుండటంతో మెల్లగా అన్‌లాక్ ప్రక్రియ కూడా మొదలవుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అన్‌లాక్ చేసేందుకు సమాయత్తమయ్యాయి. ఈ తరుణంలో లాక్‌డౌన్ ఉపసంహరించడంపై చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) హెచ్చరించిది. లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేయాలనుకునేటప్పుడు రాబోయే థర్డ్ వేవ్ గురించి ఆలోచించాలని.. ఆ తర్వాతే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. మూడో ప్రభంజనాన్ని అరికట్టేందుకు బాగా ఆలోచించి, క్రమంగా లాక్‌డౌన్, కర్ఫ్యూ లాంటివి ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఐసీఎంఆర్ సలహా ఇచ్చింది. ఈ మేరకు ఐసీఎంఆర్ చీఫ్ పలు సూచనలు చేశారు.
లాక్‌డౌన్ ఆంక్షలను సడలించి, కార్యకలాపాలను పూర్తిగా ప్రారంభించాలనే క్రమంలో మూడు అంశాల గురించి ఆలోచించుకోవాలని సూచించారు. వారం మొత్తం మీద కోవిడ్-19 పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉండటం. ఈ వ్యాధి సోకే అవకాశం ఉన్నవారిలో.. వృద్ధులు, పలు రోగాలతో బాధపడే 45 ఏళ్ల కన్నా ఎక్కువ వయసుగల వారిలో 70 శాతం కన్నా ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ జరగడం. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు తగిన విధంగా జాగ్రత్త చర్యలు తీసుకోవడం. వంటి వాటిని పరిశీలించి అన్‌లాక్ ప్రక్రియను చేపట్టవచ్చునని ఐసీఎంఆర్ చీఫ్ డాక్టర్ బలరామ్ భార్గవ మీడియా సమావేశంలో వెల్లడించారు.
Also Read: