Mukesh Ambani: ఏడురోజుల్లోనే భారీగా పెరిగిన ముఖేష్ ఆదాయం.. త్వరలోనే టాప్ టెన్ ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా స్థానం..?

Mukesh Ambani:  భారతీయ కుభేరుడు.. అసూయాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ సంపద కరోనా కష్ట కాలంలోనూ భారీగా పెరిగింది. ముఖేష్ అంబానీ..

Mukesh Ambani: ఏడురోజుల్లోనే భారీగా పెరిగిన ముఖేష్ ఆదాయం.. త్వరలోనే టాప్ టెన్  ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా స్థానం..?
Follow us
Surya Kala

|

Updated on: Jun 02, 2021 | 9:50 PM

Mukesh Ambani:  భారతీయ కుభేరుడు.. అసూయాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ సంపద కరోనా కష్ట కాలంలోనూ భారీగా పెరిగింది. ముఖేష్ అంబానీ సంపద కేవలం ఒక్క వారంలోనే 6.2 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ సంపద ఇంతభారీగా పెరగడానికి కారణం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధర పెరగడమేనని తెలుస్తోంది. వీటి షేర్లు 10 శాతానికి పైగా ర్యాలీ చేయడంతో ముఖేష్ సంపద వృద్ది చెందింది.

మంగళవారం (జూన్ 1 , 2021 ) రోజుకి అంబానీ నికర ఆస్తి విలువ 83.2 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ. 6.07 లక్షల కోట్లు. అని.. అయితే ముఖేష్ ]సంపద గత నెల మే 23న 77 బిలియన్ డాలర్ల(రూ. 5.62 లక్షల కోట్లు) కలిగి ఉన్నాడని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ సూచీ లెక్కల ప్రకారం తెలుస్తోంది. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ముఖేష్ అంబానీ 49.14శాతం వాటాను కలిగి ఉన్నారు. నిరంత‌రం జియో ప్లాట్‌ఫామ్‌, రిటైల్ బిజినెస్‌ల్లోకి నిధుల సేక‌ర‌ణ చేపట్టడంతో రిల‌య‌న్స్‌ స్టాక్ మార్కెట్ల‌లో వృద్ది కనబడింది. ఇక ఆర్‌ఐఎల్ షేర్లు మంగళవారం 0.5 శాతం పెరిగి రూ.2,169 చేరుకుంది. త్వరలోనే ఈ స్టాక్ ధర రూ.2,580 చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాగే ట్రేడింగ్ కొనసాగితే.. త్వరలో ముఖేష్ అంబానీ వ్యక్తగత సంపదలో మరో

10 బిలియ‌న్ల డాల‌ర్లు చేరుకుంటాయని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు. అంతేకాదు.. స్వ‌ల్ప కాల వ్య‌వ‌ధిలో రిల‌య‌న్స్ షేర్లు మ‌రో 15 శాతం పెరుగుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. వీరి అంచనాలు కనుక నిజమైతే.. ముఖేష్ అంబానీ ప్ర‌పంచ కుబేరుల జాబితాలో 12వ ర్యాంక్ నుంచి 8వ స్థానానికి ఎదుగుతార‌ని బ్లూంబ‌ర్గ్ బిలియ‌నీర్స్ ఇండెక్స్ పేర్కొంది.

Also Read: విశాఖ ఏజెన్సీలో రెండూ ప్రాంతాల్లో పిడుపాటు.. భారీ నష్టం 31 మూగ జీవులు మృత్యువాత