AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌ వాసులకు శుభవార్త.. నగరంలో భారీ మోడల్ కారిడార్.. ఈ ప్రాంతాల మీదుగా భారీ రోడ్డు..

GHMC: హైదరాబాద్‌లో ఇప్పటికే ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కొత్త ఫ్లైఓవర్లు, రోడ్లు, అండర్‌పాస్‌లను జీహెచ్ఎంసీ నిర్మిస్తోంది. ఇప్పటికీ కొన్ని ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలో మరో భారీ రోడ్డు నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ రెడీ అవుతోంది. దీని వల్ల నగరంలో ట్రాఫిక్ కష్టాలు మరింత తొలగిపోనున్నాయి.

Hyderabad: హైదరాబాద్‌ వాసులకు శుభవార్త.. నగరంలో భారీ మోడల్ కారిడార్.. ఈ ప్రాంతాల మీదుగా భారీ రోడ్డు..
Hyderabad
Venkatrao Lella
|

Updated on: Jan 21, 2026 | 10:56 AM

Share

హైదరాబాద్‌లో దాదాపు కోటి మందిపైకి పైగా జనం జీవిస్తున్నారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది సిటీకి వచ్చి ఇక్కడే స్థిరపడిపోతుంటారు. దీంతో ప్రజల రాకపోకల కారణంగా నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వాలు సిటీలో ఎక్కడిక్కడ ఫ్లైఓవర్లను నిర్మిస్తోంది. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లను నిర్మిస్తోంది. వీటి నిర్మాణం వల్ల ట్రాఫిక్ రద్దీ కాస్త తగ్గుతుంది. ఇప్పటికే నగరంలో అనేక ఫ్లైఓవర్లు ఉండగా.. మరో కొన్నిచోట్ల కొత్తవి నిర్మాణం జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరో భారీ రోడ్డు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ముందుడుగు వేసింది.

భారీ మోడల్ కారిడార్

నగరంలో మూసీ నది పరివాహక ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. దీంతో ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి తగ్గించేందుకు మూసీ నది వెంబడి 120 అడుగుల వెడల్పుతో భారీ మోడల్ కారిడార్ రోడ్డు నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ రెడీ అయింది. ఇందులో భాగంగా అంబర్‌పేటలోని పటేల్ నగర్ సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నుంచి నాగోల్ మెట్రో స్టేషన్ వరకు భారీ పొడవు గల రహదారిని నిర్మించనున్నారు. రెండో విడతలుగా ఈ రోడ్డును నిర్మించనుండగా.. మొదటి దశలో ఎస్టీపీ నుంచి ఉప్పల్ భగాయత్ డీమార్ట్ వరకు 2.7 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.160 కోట్లు ఖర్చు చేయనుండగా.. ఈ నెల 22న జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో దీనికి జీహెచ్ఎంసీ ఆమోదముద్ర వేయనుంది.

ఇక నో వెయిటింగ్

ఈ రోడ్డు అందుబాటులో వస్తే అంబర్ పేట, రామాంతపూర్, గోల్నాక ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఉప్పల్ సిగ్నల్ దగ్గర వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక మలక్ పేట, ముసారాంబాగ్, దిల్ సుఖ్ నగర్ ప్రాంతాల వాసులకు కూడా ఈ రోడ్డుతో ప్రయోజనం జరగనుంది. హైదరాబాద్-వరంగల్ హైవే వైపు వెళ్లేవారికి కూడా బెనిఫిట్ జరగనుంది. ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా రామంతపూర్ కేసీఆర్ నగర్ వద్ద వంతెన నిర్మిస్తారు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లు, డ్రైనేజీ వ్యవస్థను నిర్మించనున్నారు. ఈ రోడ్డు వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా మూసీ పరివాహక ప్రాంతాలు కబ్జాకు గురి కాకుండా ఉంటాయి. మరోవైపు నగరంలో అత్యధిక రద్దీ ఉండే కేబీఆర్ పార్క్ చుట్టూ భారీ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే మట్టి పరీక్ష పూర్తవ్వగా.. త్వరలో బిడ్లు ఆహ్వానించనున్నారు.

హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..