AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GHMC Council Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్‌పై ఉత్కంఠ.. అవిశ్వాసానికి సిద్ధమైన BRS.. ఎంఐఎం స్టాండ్ ఏంటి..?

జంపింగ్‌ల నేపథ్యంలో ఇవాళ్టి జీహెచ్ఎంసీ కౌన్సిల్‌ మీటింగ్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. మేయర్‌,డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్‌ఎస్‌ సిద్దమవుతుండగా... ఎంఐఎం సపోర్టు ఎవరికన్న దానిపై సస్పెన్స్‌ నెలకొంది. మధ్యలో బీజేపీ స్టాండ్‌ ఏంటి..? అన్న దానిపైనా తెగ చర్చ నడుస్తోంది.

GHMC Council Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్‌పై ఉత్కంఠ.. అవిశ్వాసానికి సిద్ధమైన BRS.. ఎంఐఎం స్టాండ్ ఏంటి..?
Ghmc Council Meeting
Shaik Madar Saheb
|

Updated on: Jul 06, 2024 | 4:11 PM

Share

జంపింగ్‌ల నేపథ్యంలో ఇవాళ్టి జీహెచ్ఎంసీ కౌన్సిల్‌ మీటింగ్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. మేయర్‌,డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్‌ఎస్‌ సిద్దమవుతుండగా… ఎంఐఎం సపోర్టు ఎవరికన్న దానిపై సస్పెన్స్‌ నెలకొంది. మధ్యలో బీజేపీ స్టాండ్‌ ఏంటి..? అన్న దానిపైనా తెగ చర్చ నడుస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్‌ బీఆర్ఎస్‌కు బై చెప్పి… హస్తం పార్టీకి నేస్తం కావడంతో ఇవాళ్టి మీటింగ్‌పై ఆసక్తి నెలకొంది. వారిద్దరిపై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. కారు పార్టీ గుర్తుతో గెలిచి కాంగ్రెస్‌లోకి ఎలా వెళ్తారంటూ.. మేయర్‌, డిప్యూటీ మేయర్ రాజీనామాకు పట్టుబట్టాలని బీఆర్‌ఎస్‌ డిసైడ్‌ అయ్యింది. అయితే మొన్నటివరకు బీఆర్ఎస్‌తో ఫ్రెండ్‌షిప్‌ చేసిన ఎంఐఎం పార్టీ.. బీఆర్‌ఎస్‌ అవిశ్వాసానికి మద్ధతు ఇస్తుందా…? లేక కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతుందా…? అన్నది సస్పెన్స్‌గా మారింది. ఇక్కడ ఇంపార్ట్‌టెంట్‌ పాయింట్ ఏంటంటే.. ఎంఐఎం ఎవరికి మద్దతిస్తే..వారికే బల్దియా పీఠం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

బీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం 47 మంది కొర్పొరేటర్లు ఉండగా.. ఎంఐఎంకి 41. బీజేపీకి 39, ఇటు కాంగ్రెస్‌కు 19 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 2020లో కాంగ్రెస్‌కు ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే ఉండగా.. అధికారంలోకి రావడంతో వారి సంఖ్య 19కి చేరింది. అయితే కౌన్సిల్‌లో బీఆర్‌ఎస్‌ బలంగా ఉన్నప్పటికీ.. ఏదో ఒకపార్టీ మద్దతు ఉంటేనే అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పుడున్న బీఆర్ఎస్‌ కార్పొరేటర్లలో ఎంతమంది మీటింగ్‌ వస్తారన్నది క్లారిటీ లేదు. మరోవైపు బీజేపీ స్టాండ్‌పైనా తెగ చర్చ నడుస్తోంది. కౌన్సిల్‌ మీటింగ్‌లో వారు ఏం మాట్లాడతారు…? వారి వ్యూహమేంటన్నది…? ఉత్కంఠగా మారింది.

2021 నుంచి 19 సార్లు కౌన్సిల మీటింగ్‌ జరిగినప్పటికీ.. ఏనాడు సవ్యంగా జరగలేదు. ఈసారి కూడా అదే ట్రెండ్‌ కంటిన్యూ అవుతుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు 2021 ఫిబ్రవరిలో తొలి కౌన్సిల్‌ సమావేశం జరిగింది. అప్పటినుంచి నాలుగేళ్లు.. అంటే 2025 ఫిబ్రవరి వరకు అవిశ్వానికి నో ఛాన్స్‌ అంటున్నారు పలువురు. రూల్‌ బుక్‌లోఇలానే ఉందని చెబుతున్నారు. మరి ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇవాళ్టి మీటింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..