AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramadan 2023: తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ పండుగ జరుపుకునేది ఎప్పుడంటే..?

గల్ఫ్ దేశాల్లో రంజాన్ పర్వదిన వేడుకులు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. గురువారం నెలవంక కనిపించడంతో శుక్రవారం పండుగ నిర్వహిస్తున్నారు. అయితే, మనదేశంలో శుక్రవారం నెలవంక కనిపిస్తే శనివారం రంజాన్‌ పండుగ జరగనుంది. లేకపోతే.. ఆదివారం పండుగ జరుగుతుందని ముస్లిం పెద్దలు ప్రకటించారు.

Ramadan 2023: తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ పండుగ జరుపుకునేది ఎప్పుడంటే..?
Ramadan 2023
Shaik Madar Saheb
|

Updated on: Apr 21, 2023 | 11:23 AM

Share

గల్ఫ్ దేశాల్లో రంజాన్ పర్వదిన వేడుకులు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. గురువారం నెలవంక కనిపించడంతో శుక్రవారం పండుగ నిర్వహిస్తున్నారు. అయితే, మనదేశంలో శుక్రవారం నెలవంక కనిపిస్తే శనివారం రంజాన్‌ పండుగ జరగనుంది. లేకపోతే.. ఆదివారం పండుగ జరుగుతుందని ముస్లిం పెద్దలు ప్రకటించారు. శుక్రవారం నెలవంక దర్శనమిస్తే.. శనివారం రమదాన్ పండుగ జరుపుకోవాలని.. లేకపోతే.. ఆదివారం పండుగను నిర్వహించుకోవాలని రుహియతే హిలాల్‌ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ )ప్రతినిధి ముఫ్తీ మహ్మద్‌ ఖలీల్‌ అహ్మద్‌ వెల్లడించారు. రుహియతే హిలాల్‌ కమిటీ శుక్రవారం సాయంత్రం 7 గంటల వరకు దీనిపై స్పష్టతనిస్తుందని, దాని ప్రకారం పండుగ జరుపుకోవాలని ఆయన ముస్లింలకు సూచించారు.

ఇదిలాఉంటే.. ఇస్లాంలో రంజాన్‌ మాసం చివరి శుక్రవారానికి ఎక్కువ ప్రధాన్యం ఇస్తారు. ఈ రోజు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీస్సులు పొందుతారు. జుమ్మతుల్‌ విదాను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని అన్ని మసీదుల వద్ద ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా మక్కా మసీదు, పబ్లిక్‌ గార్డెన్స్‌లోని రాయల్‌ మసీదులో జుమ్మతుల్‌ విదా ప్రార్థనలకు ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. దీంతోపాటు జీహెచ్ఎంసీ పరిధిలోని మసీదు పరిసరాలను కూడా శుభ్రం చేసినట్లు తెలిపారు.

ఈద్గాలలో నమాజ్‌ కోసం ఏర్పాట్లు

రంజాన్‌ పండుగ నేపథ్యంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని అన్ని ఈద్గాలలో సామూహిక ప్రార్థనల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు గురువారం రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ మసీవుల్లా ఖాన్‌ వెల్లడించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈద్గాలలో కూడా సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

సౌదీ అరేబియాలో చంద్రుని దర్శనం ద్వారా ఈద్-ఉల్-ఫితర్ శుక్రవారమే జరుపుకోవాలని కేరళలోని ముస్లిం పెద్దలు నిర్ణయించారు. ఈ రోజు కేరళలో రంజాన్ వేడుకలు జరుగుతున్నాయి. జమ్మూకశ్మీర్ లో రేపు వేడుకలు జరగనున్నాయి. కాగా.. చంద్రుడి దృశ్యమానత ప్రకారం.. రేపు వేడుకలు జరుగుతాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
వికెట్ల వేటలో విఫలమవుతున్న స్టార్ బౌలర్లు
వికెట్ల వేటలో విఫలమవుతున్న స్టార్ బౌలర్లు