CPI: ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే అగ్నిపథ్.. కేంద్రంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. కేంద్రం యువతను...
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. కేంద్రం యువతను మోసం చేసిందన్న నారాయణ.. బీజేపీ 420 కాదు అంతకంటే డబల్ అని మండిపడ్డారు. అగ్నిపథ్(Agnipath) వ్యతిరేకంగా పోరాటంలో లో చనిపోయిన ఒక్కొక్కరికి రూ.కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిహార్ లో మొదలైన ఉద్యమం తెలంగాణ వరకూ పాకిందని అన్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత ఉద్యోగం నుంచి తీసేస్తే యువత ఎలా బతకాలని ప్రశ్నించారు. అగ్నిపథ్ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రెండుకోట్ల ఉద్యోగాలు అని చెప్పి ప్రభుత్వ సంస్థలను మూసివేస్తున్నారని నారాయణ ఫైర్ అయ్యారు. బాసర విద్యార్థులను అవమానించిన తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు.
కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టుకంటే తప్పులేదన్న నారాయణ.. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేస్తే బాగుంటుందని సూచించారు. చంద్రబాబు నిజం చెబితేనే నమ్మని ప్రజలు కేసీఆర్ అబద్ధాలు చెప్పినా నమ్ముతారని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చే విధంగా సీఎం జగన్ పోరాడాలని హితవు పలికారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి