Agnipath Protest: విధ్వంసానికి పక్కా ప్లాన్..ఓ ప్రైవేట్ అకాడమీ కీ రోల్.. డైరెక్టర్ ఆవుల సుబ్బారావు అరెస్ట్
సికింద్రాబాద్ రైల్వే విధ్వంస మొత్తం ఎపిసోడ్ వెనుక సాయి డిఫెన్స్ అకాడమీ కీ రోల్ పోషించినట్టు తెలుస్తోంది. ఆందోళన జరిగినా.. దాడులు చేసినా అందుకు సంబంధించిన సరంజామా మొత్తం సాయి డిఫెన్స్ అకాడమీతో పాటు మరికొన్ని ప్రయివేట్ అకాడమీలు బాధ్యత తీసుకున్నట్టు తెలుస్తోంది
Agnipath Protest: సికింద్రాబాద్ లో అగ్నిపథ్ ఆందోళన అప్పటికప్పుడు జరిగింది కాదు. ఈ విధ్వంసానికి వారం రోజుల ముందునుంచి ప్రిపరేషన్ జరిగినట్లు తెలుస్తోంది. వాట్సప్ గ్రూపుల్లో ఆందోళనకారులు కో ఆర్డినేషన్ చేసుకున్నారు. ఎవరెవరు.. ఎప్పుడు.. ఎక్కడికి ఎలా చేరాలో పక్కా పథకం రూపొందించుకున్నారు. వేల మంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి చేరుకుని బీభత్సం సృష్టించారంటే వ్యూహ రచన ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుంది.
హకీంపేట ఆర్మీ సోల్జర్ పేరుతో కొంతమంది విద్యార్థులు వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఆ గ్రూప్‌లో దాడి, ఆందోళనకు సంబంధించిన వివరాలు పంచుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక సాయి డిఫెన్స్ అకాడమీ కీ రోల్ పోషించినట్టు తెలుస్తోంది. నిరసన ర్యాలీకి సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు హాజరవుతారని.. అందరూ కలిసి ఆయనకు సపోర్ట్ చేయాలని గ్రూప్‌లో ఉన్న సభ్యులు డిసైడ్ అయ్యారు. టీవీ9 చేతికి చిక్కిన వాట్సప్ గ్రూప్ ఆధారాల్లో ఇదే విషయం స్పష్టమైంది.
ఆందోళన జరిగినా.. దాడులు చేసినా అందుకు సంబంధించిన సరంజామా మొత్తం సాయి డిఫెన్స్ అకాడమీతో పాటు మరికొన్ని ప్రయివేట్ అకాడమీలు బాధ్యత తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆందోళనకారులకి వాటర్ బాటిళ్లు, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లు సప్లయ్ చేసే బాధ్యత తీసుకున్నాయి. దాదాపు 2వేల మంది.. రైల్వే స్టేషన్‌ను ముట్టడించి రణరంగం సృష్టించినట్టు తెలుస్తోంది. టీవీ9 చేతికి చిక్కిన వాట్సప్ గ్రూప్ ఆధారాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
కేవలం వాట్సప్ గ్రూప్‌లో మాత్రమే కాదూ ఫోన్‌కాల్స్‌లోనూ విధ్వంసానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నారు. బ్యానర్లు ప్రదర్శించినా, అరుపులు కేకలు వేసినా ఏమాత్రం ప్రయోజనం ఉండదని.. పెట్రో దాడులతోనే స్పందన ఉంటుందని ముందుగానే మాట్లాడుకుకుని.. భారీ విధ్వంసానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..