Revanth Reddy: బీఆర్ఎస్ నేతలు చేసిన త్యాగాలేంటి..? రాజీవ్‌ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో చూస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్‌ ప్రభుత్వం పంతం నెరవేర్చుకుంది.. సెక్రటేరియట్‌ ముందు దివంగత మాజీ ప్రధాని విగ్రహాన్ని ఆవిష్కరించింది. అనేక వివాదాలు, విపక్షపార్టీ ఆక్షేపణల నడుమ సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ భారీ విగ్రహాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించారు.

Revanth Reddy: బీఆర్ఎస్ నేతలు చేసిన త్యాగాలేంటి..? రాజీవ్‌ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో చూస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy
Follow us

|

Updated on: Sep 16, 2024 | 8:34 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం పంతం నెగ్గించుకుంది.. సెక్రటేరియట్‌ ముందు దివంగత మాజీ ప్రధాని విగ్రహాన్ని ఆవిష్కరించింది. అనేక వివాదాలు, విపక్షపార్టీ ఆక్షేపణల నడుమ సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ భారీ విగ్రహాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందరర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాము ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో చూస్తామన్నారు. డిసెంబర్‌ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామన్నారు. సొంత విగ్రహం పెట్టుకుందామనే ఇక్కడ స్థలం ఖాళీగా ఉంచుకున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం BRS నేతలు చేసిన త్యాగాలు ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఏర్పాటుకు స్థలాన్ని ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే కేసీఆర్ కుటుంబం ఒక్కరు కూడా హాజరు కాలేదన్నారు. కొంతమంది మిడతల దండును ప్రజల మీదకు ఉసి గొల్పుతున్నారని.. కాంగ్రెస్ కార్యకర్తలు తరిమికొట్టాలంటూ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐదేళ్లు మహిళకు మంత్రి వర్గంలో చోటు ఇవ్వని వారికి మహిళా అభివృద్ధి గురించి ఏం తెలుస్తోందన్నారు. రాజీవ్ గాంధీ తెచ్చిన కంప్యూటర్ పరిజ్ఞానంతోనే కేటీఆర్ అమెరికా వెళ్లి జాబ్ చేశారని.. ఐటి మంత్రి అయ్యారంటూ పేర్కొన్నారు. త్యాగాలు అంటే నెహ్రూ, ఇందిరమ్మ, రాజీవ్ కుటుంబానిదేనన్నారు.

తెలంగాణ ఇచ్చింది మేము.. తెలంగాణ తెచ్చింది మేము.. సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేది మేము.. అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిందని.. అయితే.. కొందరు వారసత్వ రాజకీయాలపై మాట్లాడుతున్నారని.. BRS నేతలు చేసిన త్యాగాలు ఏంటో చెప్పాలన్నారు.

బీఆర్ఎస్ ఆగ్రహం..

ఇదిలాఉంటే.. సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ ఫైర్ అయింది.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏంటని ప్రశ్నించారు మాజీమంత్రి ప్రశాంత్ రెడ్డి. ఇదే స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నామన్నారు. రాజీవ్ విగ్రహం తొలగింపుపై ప్రజల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాజీవ్‌ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో చూస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
రాజీవ్‌ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో చూస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
మీ పీఎఫ్‌ ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవాలా? ఈ 4 సులభమైన పద్ధతుల్లో..
మీ పీఎఫ్‌ ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవాలా? ఈ 4 సులభమైన పద్ధతుల్లో..
తృటిలో త‌ప్పిన పెను ప్ర‌మాదం.. లారీలో మంట‌లు.. ఆ పక్కనే ఉన్న..?
తృటిలో త‌ప్పిన పెను ప్ర‌మాదం.. లారీలో మంట‌లు.. ఆ పక్కనే ఉన్న..?
దేవిపుత్రుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయింది..!
దేవిపుత్రుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయింది..!
లవ్‌ లైఫ్‌ గురించి చెప్పిన మృణాల్‌.. పాపం అన్ని బ్రేకప్సా..
లవ్‌ లైఫ్‌ గురించి చెప్పిన మృణాల్‌.. పాపం అన్ని బ్రేకప్సా..
దారులన్నీ సాగర్‌ వైపే.. ఖైరతాబాద్ మహా గణేష్ నిమజ్జనం షెడ్యూల్ ఇదే
దారులన్నీ సాగర్‌ వైపే.. ఖైరతాబాద్ మహా గణేష్ నిమజ్జనం షెడ్యూల్ ఇదే
యంగ్ హీరోలకే అందని దూకుడు.. దూసుకుపోతున్న సూపర్ స్టార్
యంగ్ హీరోలకే అందని దూకుడు.. దూసుకుపోతున్న సూపర్ స్టార్
ఓటిటిలో విడుదలైన తర్వాత పెరుగుతున్న ట్రోలింగ్
ఓటిటిలో విడుదలైన తర్వాత పెరుగుతున్న ట్రోలింగ్
పెళ్లి ఒక్కడితో.. హనీమూన్ మరొకడితో..
పెళ్లి ఒక్కడితో.. హనీమూన్ మరొకడితో..
కొత్త హోండా ఎలివేట్ అపెక్స్ ఎడిషన్.. మతి పోగొట్టే ఇంటీరియర్స్
కొత్త హోండా ఎలివేట్ అపెక్స్ ఎడిషన్.. మతి పోగొట్టే ఇంటీరియర్స్
తృటిలో త‌ప్పిన పెను ప్ర‌మాదం.. లారీలో మంట‌లు.. ఆ పక్కనే ఉన్న..?
తృటిలో త‌ప్పిన పెను ప్ర‌మాదం.. లారీలో మంట‌లు.. ఆ పక్కనే ఉన్న..?
హాలీవుడ్​ లో 'దేవర' ఫీవర్.. అమెరికాకు జూనియర్ ఎన్​టీఆర్ పయనం.?
హాలీవుడ్​ లో 'దేవర' ఫీవర్.. అమెరికాకు జూనియర్ ఎన్​టీఆర్ పయనం.?
కరోనా తర్వాత అందరి హెల్త్ తేడా వచ్చేసిందా..!
కరోనా తర్వాత అందరి హెల్త్ తేడా వచ్చేసిందా..!
మిస్టరీ వీడింది.. భూమిపై 9 రోజులు భయానక శబ్దాలు.!
మిస్టరీ వీడింది.. భూమిపై 9 రోజులు భయానక శబ్దాలు.!
రేప్ చెయ్యడానికొచ్చిన డాక్టర్‌.. ప్రైవేట్ పార్టులను కోసేసిన నర్స్
రేప్ చెయ్యడానికొచ్చిన డాక్టర్‌.. ప్రైవేట్ పార్టులను కోసేసిన నర్స్
కూలీకి కోటిన్నర వజ్రం దొరికింది.రాత్రికిరాత్రే జీవితం మారిపోయింది
కూలీకి కోటిన్నర వజ్రం దొరికింది.రాత్రికిరాత్రే జీవితం మారిపోయింది
ప్రకాశం బ్యారేజ్ లో బోట్ల తొలగింపు ఎంతవరకు వచ్చింది.? వీడియో..
ప్రకాశం బ్యారేజ్ లో బోట్ల తొలగింపు ఎంతవరకు వచ్చింది.? వీడియో..
అమెజాన్‌లో తీవ్ర కరవు. కరవులో చిక్కుకున్న డజన్ల కొద్ది తెగలప్రజలు
అమెజాన్‌లో తీవ్ర కరవు. కరవులో చిక్కుకున్న డజన్ల కొద్ది తెగలప్రజలు
మొన్న ఫ్యామిలీ.. ఈ నెల పెళ్లి కావాల్సి ఉండగా రోడ్డు ప్రమాదం.!
మొన్న ఫ్యామిలీ.. ఈ నెల పెళ్లి కావాల్సి ఉండగా రోడ్డు ప్రమాదం.!
ఆర్మీ అధికారులను దోచుకుని.. వారి స్నేహితురాళ్లపై అత్యాచారం చేసి..
ఆర్మీ అధికారులను దోచుకుని.. వారి స్నేహితురాళ్లపై అత్యాచారం చేసి..