Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS TET-2022: టెట్ -2022 కు సమస్యల స్వాగతం.. సాంకేతిక తప్పిదాలతో అభ్యర్థులకు కష్టాలు

ఈ నెల 12న జరిగనున్న తెలంగాణ టెట్-2022కు(Telangana TET) కష్టాలు స్వాగతం పలుకుతున్నాయి. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం వాటికి భిన్నంగా ఉన్నాయి. హాల్ టికెట్లలో తప్పులు, ఫొటో, సంతకంలో...

TS TET-2022: టెట్ -2022 కు సమస్యల స్వాగతం.. సాంకేతిక తప్పిదాలతో అభ్యర్థులకు కష్టాలు
Ts Tet 2022
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 10, 2022 | 9:46 PM

ఈ నెల 12న జరిగనున్న తెలంగాణ టెట్-2022కు(Telangana TET) కష్టాలు స్వాగతం పలుకుతున్నాయి. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం వాటికి భిన్నంగా ఉన్నాయి. హాల్ టికెట్లలో తప్పులు, ఫొటో, సంతకంలో పొరపాట్లు, పరీక్షా కేంద్రం వివరాలు సరిగ్గా లేకపోవడంతో అభ్యర్థులు సతమతమవుతున్నారు. సమస్యను పరిష్కరించుకునేందుకు డీఈవో ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నారు. కాగా.. అప్లికేషన్లను చివరి క్షణంలో చేసుకున్న అభ్యర్థులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. సొంత ప్రాంతంలో కాకుండా, పక్క జిల్లాల్లో పరీక్ష కేంద్రం ఇవ్వడంతో ఇక్కట్లు పడుతున్నారు. అంతే కాకుండా ఒకే పేరుతో జిల్లా కేంద్రంలో రెండు మూడు కాలేజీలున్నాయి. దీంతో ఏ కాలేజీలో పరీక్ష రాయాలో తెలియని గందరగోళం అభ్యర్థుల్లో ఏర్పడింది.

పరీక్ష కేంద్రం ఫోన్‌ నంబర్లను అందుబాటులో ఉంచామని అధికారులు చెబుతున్నా.. వాటికి ఫోన్ చేస్తే ఎలాంటి స్పందన రావడం లేదని అభ్యర్థులు చెబుతున్నారు. టెట్‌ పరీక్ష నిర్వహణపై అధికారులు మొదటినుంచీ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ సమయంలో చాలా రోజులు వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాలేదు. దరఖాస్తులు అప్‌లోడ్‌ చేసిన తర్వాత తప్పుల సవరణకు ప్రత్యేకంగా అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అయినా వాటిని అధికారులు పట్టించుకోలేదు.

మరోవైపు.. టెట్-2022 రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల12న జరగనుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు తప్పనిసరిగా ఓఎమ్‌ఆర్‌ షీట్‌లో బబ్లింగ్ చేయడానికి బ్లాక్ ఇంక్ పెన్నులను మాత్రమే వాడాలని ఎన్సీఈఆర్టీ సెక్రటరీ రాధారెడ్డి తెలిపారు. పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..