KTR: ఈ నెల ఎవ్వరూ కరెంట్ బిల్లులు కట్టొద్దు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల లోతులో బొంద పెడతామంటూ లండన్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్‌పై పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ.. పులి బయటకు వస్తే, బోనులో బంధిస్తామంటూ రేవంత్‌ హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజాగా సీఎం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ మండిపడ్డారు.

KTR: ఈ నెల ఎవ్వరూ కరెంట్ బిల్లులు కట్టొద్దు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..
KTR
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 20, 2024 | 1:46 PM

బీఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల లోతులో బొంద పెడతామంటూ లండన్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్‌పై పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ.. పులి బయటకు వస్తే, బోనులో బంధిస్తామంటూ రేవంత్‌ హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజాగా సీఎం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ మండిపడ్డారు. 100 మీటర్ల లోపల పార్టీని బొందపెట్టే సంగతి తర్వాత చూద్దామని.. వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలపై దృష్టిపెట్టాలంటూ కేటీఆర్‌ హితబోధ చేశారు. అహంకారంతో మాట్లాడిన రేవంత్‌ వంటి నేతలను BRS తమ ప్రస్థానంలో చాలామందిని చూసిందని చెప్పారాయన. ‘తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతావ్’ అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చినందుకా అని నిగ్గదీసి అడిగారాయన.

దీంతోపాటు కరెంట్ బిల్లులపై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టవద్దని పిలుపునిచ్చారు. కరెంటు బిల్లుల గురించి అడిగితే అధికారులకు సీఎం గతంలో చేసిన మాటలను చూపించాలని కేటీఆర్ సూచించారు. సోనియా గాంధీ బిల్లు కడతారని రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పారని ఆయన వివరించారు. కరెంటు బిల్లు ప్రతులను సోనియా ఇంటికి పంపించాలని ప్రజలను కోరారు. హైదరాబాద్‌లోని ప్రతి ఒక్క మీటర్‌కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.