Hyderabad: పైకేమో సోషల్ సర్వీస్ అని బిల్డప్.. హోటల్‌లో గుట్టు చప్పుడు కాకుండా…

గురువారం హైదరాబాద్ అబిడ్స్‌లో టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలు చేయగా.. ఫర్ట్యూన్ హోటల్ లో వ్యభిచారం చేస్తూ ముఠా పట్టుబడింది. రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం. బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్‌‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Hyderabad: పైకేమో సోషల్ సర్వీస్ అని బిల్డప్.. హోటల్‌లో గుట్టు చప్పుడు కాకుండా...
Akhil Pahilwan
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 21, 2024 | 3:51 PM

హైదరాబాద్, జనవరి 20:  సోషల్ సర్వీస్ చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో కలరింగ్. కానీ అసలు చేసేది దగుల్భాజీ వ్యాపారం. అఖిల్ పహిల్వాన్ అనే పేరు హైదరాబాద్‌లో ఉండే చాలామందికి తెల్సు. బోనాల జాతర సందర్భంగా ఇతగాడు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. తొట్టెల ఊరేగింపు అప్పుడు చిన్నా చితక సినిమావాళ్లను పిలిచి హడావిడి చేస్తుంటాడు. తాజాగా ఈ పహిల్వాన్ ఆధ్వర్యంలోనే జరుగుతున్న గలీజు దందా బయటకు వెలుగుచూసింది. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం హైదరాబాద్ అబిడ్స్‌లో తనిఖీలు చేయగా.. ఫర్ట్యూన్ హోటల్లో వ్యభిచారం చేస్తున్న ముఠా పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో లోతైన విచారణ చేయగా అఖిల్ పహిల్వాన్ పేరు తెరపైకి వచ్చింది. రామ్‌నగర్ అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో ఈ వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడుల్లో ఈ చీకటి వ్యవహారం వెలుగుచూసింది. 16 మంది అమ్మాయిలు, నలుగురు కస్టమర్స్, ఇద్దరు ఆర్గనైజర్స్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. 22 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగాల పేరుతో విదేశాల నుంచి అమ్మాయిలను నగరానికి రప్పిస్తున్నారు నిర్వాహకులు. బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసుల తనిఖీల్లో బయటపడింది. యువతులను స్టేట్ హోమ్‌కు తరలించగా.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..