Revanth Reddy: లండన్‌లో సీఎం రేవంత్ – అక్బరుద్దీన్ ఓవైసీ చెట్టాపట్టాల్.. లోక్‌సభ ఎన్నికలే టార్గెటా..?

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, MIM సపోర్టుతో ముందుకెళ్లాలని భావిస్తోందా..? అదే జరిగితే అసెంబ్లీ ఎన్నికల మాదరిగే..లోక్‌సభ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు గెలవాలని యోచిస్తోంది. మొత్తానికి అక్బరుద్దీన్‌తో సీఎం కలిసి పాల్గొనడం.. లండన్‌ పాలిటిక్స్‌ వ్యూహం ఏంటనేది హాట్ టాపిక్‌గా మారింది.

Revanth Reddy: లండన్‌లో సీఎం రేవంత్ - అక్బరుద్దీన్ ఓవైసీ చెట్టాపట్టాల్.. లోక్‌సభ ఎన్నికలే టార్గెటా..?
Revanth Reddy, Akbaruddin Owaisi
Follow us
Sravan Kumar B

| Edited By: Balaraju Goud

Updated on: Jan 20, 2024 | 9:10 PM

పార్లమెంట్‌ ఎన్నికలపై వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది కాంగ్రెస్‌ పార్టీ. లండన్‌ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి టీంలో సడెన్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రత్యక్షమవడం పొలిటికల్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. రాజకీయంగా ఎంఐఎం పార్టీని దగ్గర చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని పొలిటికల్ గా డిస్కషన్ జరుగుతుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్బర్‌ని కాంగ్రెస్ ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్‌లో భారతీయ మూలాలున్న బ్రిటిష్ పార్లమెంట్ మెంబర్లతో సమావేశమయ్యారు. చారిత్రాత్మకమైన వెస్ట్ మినిస్టర్ ప్యాలె‌స్‌లో జరిగిన ఈ భేటీ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘భారత్, బ్రిటన్ మధ్య బలమైన బంధం ప్రజాస్వామ్యమే. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడమే అత్యవసరం’ అన్నారు.

యునెస్కో 1016 సంవత్సరంలోనే లండన్ లోని వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ ను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ చారిత్రక భవనంలోనే ఈ సమావేశం జరిగింది. లేబర్ పార్టీ ఎంపీ వీరేంద్ర శర్మతో పాటు మరో ఏడుగురు ఎంపీలు, ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అయితే రేవంత్ రెడ్డి టీంలో అక్బరుద్దీన్ ఓవైసీ ప్రత్యక్షమవడం పొలిటికల్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. థీమ్స్ నది నిర్వహణపై అధ్యయనం చేసి మూసీ నది ప్రక్షాళనలో అమలు చేయాలనేది సీఎం మీటింగ్ సారాంశం. అయితే గతంలో మూసీ నది ప్రక్షాళన చేసి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కమర్షియల్ సర్క్యూట్ డిజైన్ చేయాలని జరిపిన సమీక్షలో, పాతబస్తీకి మెట్రో ను విస్తరించే సమీక్షలో పాత బస్తికి చెందిన ఎంఐఎం నేతలు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు లండన్ పర్యటనకి అక్బరుద్దీన్ కి అధికారికంగా ఆహ్వానందినట్లుగా సమాచారం.

ఇక లండన్ పర్యటనలో ఈఇద్దరు నేతలు కలిసి పాల్గొనడం చూస్తుంటే తెలంగాణ రాజకీయాల్లో పార్టీల మధ్య ఏం జరుగుతుందనే ఆలోచన మొదలైంది. మూసీ ప్రక్షాళన అంశం మాటున MIM కాంగ్రెస్ మధ్య మైత్రి జరగబోతోందని ఎంపీ ఎలక్షన్ల నేపథ్యంలో రేవంత్.. ఎంఐఎంను కలుపుకునే ప్రయత్నం చేస్తున్నరనే టాక్ వినిపిస్తుంది. లండన్ లో అక్బరుద్దీన్, రేవంత్ మధ్య ఏం చర్చ జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా ఎంఐఎం పార్టీని దగ్గర చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని పొలిటికల్ గా డిస్కషన్ జరుగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రోటీన్ స్పీకర్ గా ఎన్నుకున్నారు. ఆ తర్వాత అక్బరుద్దీన్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అక్బర్ నీ కాంగ్రెస్ ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకోవడం ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్ గా వాడి వేడి చర్చలు జరగటం. ఇప్పుడు అక్బరుద్దీన్ సీఎం లండన్ పర్యటనలో కలిసి పాల్గొనడం అన్ని చూస్తుంటే తెలంగాణ రాజకీయాల్లో ఈ రెండు పార్టీల మధ్య ఏం జరుగుతుందనే ఆలోచన మొదలైంది.

మరోవైపు పార్లమెంట్‌ ఎన్నికలపై తగ్గేదేలే అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. మెజార్టీ స్థానాలు సాధించి తీరుతామంటున్నారు. అధికారం పోయినా బీఆర్‌ఎస్‌కు అహంకారం తగ్గలేదన్నారు సీఎం రేవంత్. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడించి..బీఆర్‌ఎస్‌ గుర్తు లేకుండా చేస్తామని లండన్‌ వేదికగా ఫైరయ్యారు రేవంత్‌రెడ్డి. వంద మీటర్ల లోతులో పాతిపెడతామన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, MIM సపోర్టుతో ముందుకెళ్లాలని భావిస్తోందా..? అదే జరిగితే అసెంబ్లీ ఎన్నికల మాదరిగే..లోక్‌సభ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు గెలవాలని యోచిస్తోంది. మొత్తానికి అక్బరుద్దీన్‌తో సీఎం కలిసి పాల్గొనడం.. లండన్‌ పాలిటిక్స్‌ వ్యూహం ఏంటనేది హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…