AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరుద్యోగులకు ఆర్టీసీ శుభవార్త.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగం

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. శిక్షణ వ్యవధి మూడేళ్లుగా ఉంటుంది. మొదటి, రెండు, మూడు సంవత్సరాలకు వరుసగా నెలకు రూ.15000, రూ.16000, రూ.17000 స్టైఫండ్ చెల్లిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీగా ఫిబ్రవరి...

నిరుద్యోగులకు ఆర్టీసీ శుభవార్త.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగం
TSRTC JOBS
Narender Vaitla
|

Updated on: Jan 20, 2024 | 4:06 PM

Share

తెలంగాణ ఆర్టీసీ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న డిపోల్లో ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం మూడేళ్ల కాల వ్యవధికోసం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల్లో ఉన్న అప్రెంటిస్‌ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏయే రీజియన్స్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో హైదరాబాద్ రీజియన్ (26), సికింద్రాబాద్ రీజియన్‌ (18), మహబూబ్ నగర్ రీజియన్‌ (14), మెదక్ రీజియన్‌ (12), నల్గొండ రీజియన్ (12), రంగారెడ్డి రీజియన్‌ (12), ఆదిలాబాద్ రీజియన్ (09), కరీంనగర్ రీజియన్ (15), ఖమ్మం రీజియన్ (09), నిజామాబాద్ రీజియన్ (09), వరంగల్ రీజియన్‌ (14) ఖాళీలు ఉన్నాయి. నాన్‌ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న ఖాళీలకు బీకామ్‌, బీఎస్‌సీ, బీఏ, బీబీఏ, బీసీఏ పూర్తి చేసి ఉండాలి.

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. శిక్షణ వ్యవధి మూడేళ్లుగా ఉంటుంది. మొదటి, రెండు, మూడు సంవత్సరాలకు వరుసగా నెలకు రూ.15000, రూ.16000, రూ.17000 స్టైఫండ్ చెల్లిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీగా ఫిబ్రవరి 16వ తేదీని నిర్ణయించారు. టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకునే ముందు www.nats.education.gov.in వెబ్‌సైట్‌లో అభ్యర్థులు వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్ సందర్శించమని అధికారులు తెలిపారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!