AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar Power Plant: తెలంగాణలో మరిన్ని EV చార్జింగ్ స్టేషన్లు.. డొమెస్టిక్ సోలార్ ప్లాంట్లకు భారీ రాయితీలు

తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న సోలార్, విండ్, స్మాల్ హైడ్రో పవర్, చెత్త నుంచి విద్యుత్ తయారీ, నిర్వహిస్తున్న కార్యక్రమాలపై రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి టీఎస్ రెడ్‌కో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Solar Power Plant: తెలంగాణలో మరిన్ని EV చార్జింగ్ స్టేషన్లు.. డొమెస్టిక్ సోలార్ ప్లాంట్లకు భారీ రాయితీలు
Dy Cm Mallu Bhatti Vikramarka
Sravan Kumar B
| Edited By: Balaraju Goud|

Updated on: Jan 20, 2024 | 4:48 PM

Share

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విద్యుత్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని టీఎస్ రెడ్‌కో అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న సోలార్, విండ్, స్మాల్ హైడ్రో పవర్, చెత్త నుంచి విద్యుత్ తయారీ, నిర్వహిస్తున్న కార్యక్రమాలపై రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి టీఎస్ రెడ్‌కో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పెట్రోల్ డీజిల్ వాహనాలతో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడంతోపాటు ఇంధన పొదుపు చర్యలను పోత్సహిస్తోంది రాష్ట్ర సర్కార్. ఇటీవల మార్కెట్లోకి వస్తున్న విద్యుత్ వాహనాలకు చార్జింగ్ అందించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్లు నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందని అధికారులకు సూచించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ కొరత రాకుండా ఉండటానికి సోలార్ విద్యుత్ ను పెద్ద మొత్తంలో వినియోగంలోకి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని జలాశయాలపై సోలార్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ రూప్ టాప్ సిస్టం ఏర్పాటు చేసుకుని అమలు పరచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సోలార్, విండ్, హైడ్రోజన్, పంప్డ్ స్టోరేజ్ లాంటి టెక్నాలజీ పాలసీలు పెండింగ్‌లో ఉన్న అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో డిప్యూటీ సీఎం చర్చించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో సేకరించిన చెత్త నుంచి కంప్రెస్డ్ బయో గ్యాస్, విద్యుత్ తయారీ పనులు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలపై ఆరా తీశారు. ఖమ్మం వరంగల్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు గురించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్‌కు పంపించిన ప్రతిపాదనల గురించి టీఎస్ రెడ్కో వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జానయ్య డిప్యూటీ సీఎంకు వివరించారు.

తెలంగాణ వ్యాప్తంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి గృహ వినియోగదారులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీల పై అవగాహన కల్పించి ప్రోత్సహించాలని ఆదేశాలు ఇచ్చారు. గృహ వినియోగదారులకు ఒక కిలో వాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేందుకు 18 వేల రూపాయల రాయితీ ప్రభుత్వం ఇస్తున్నదని చెప్పారు. మూడు కిలో వాట్స్ వరకు 18 వేల రూపాయల చొప్పున సబ్సిడీ ఇస్తామన్నారు. మూడు కిలో వాట్స్ నుంచి పది కిలో వాట్స్ వరకు కిలో వాట్ కు 9వేల రూపాయల చొప్పున ప్రభుత్వం రాయితీ ఇస్తుందన్నారు. ఈ అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఉపయోగంతో కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. టీఎస్ రెడ్కో సంస్థ నిర్వహణ,  బోర్డు కమిటీ, సంస్థ ద్వారా అమలు చేస్తున్న పథకాలు, సంస్థ సిబ్బంది పని తీరు గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆ సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. జానయ్య డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…