Collector Farming: హోదాను పక్కన పెట్టి.. పొలంలో దిగి వరి నాట్లు వేసిన కలెక్టర్.

Collector Farming: హోదాను పక్కన పెట్టి.. పొలంలో దిగి వరి నాట్లు వేసిన కలెక్టర్.

Anil kumar poka

|

Updated on: Jan 20, 2024 | 6:56 PM

ఆయన ఓ జిల్లాకు కలెక్టర్. ఎప్పుడూ అధికారులతో సమావేశాలు, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ పనుల్లో బిజీగా ఉండే ఆయన రైతుగా మారారు. పొలంలోని బురదలోకి దిగి వరి నాట్లు... వేసి అందరిని ఆశ్చర్యపరిచారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పర్యటనలో భాగంగా చందపల్లి గ్రామానికి వచ్చారు. అక్కడి రైతుల పొలాను పరిశీలించారు. సాగు పద్ధతులను పంటలో వచ్చే లాభం, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై కలెక్టర్.. రైతులను అడిగి తెలుసుకున్నారు.

ఆయన ఓ జిల్లాకు కలెక్టర్. ఎప్పుడూ అధికారులతో సమావేశాలు, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ పనుల్లో బిజీగా ఉండే ఆయన రైతుగా మారారు. పొలంలోని బురదలోకి దిగి వరి నాట్లు… వేసి అందరిని ఆశ్చర్యపరిచారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పర్యటనలో భాగంగా చందపల్లి గ్రామానికి వచ్చారు. అక్కడి రైతుల పొలాను పరిశీలించారు. సాగు పద్ధతులను పంటలో వచ్చే లాభం, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై కలెక్టర్.. రైతులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయంలో నారుమడి వేసిన దగ్గర నుంచి రైతులు పంట కోసి అమ్మకం చేసే వరకు ప్రతి దశలో అందుబాటులో ఉంటూ వారికి సలహాలు సూచనలు అందజేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. నూతన సాగు పద్ధతులను రైతులకు వివరించాలని అధికారులకు సూచించారు. అలాగే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే విధంగా రైతులకు సూచనలు ఇవ్వాలని వివరించారు. పంట కొనుగోలు సమయంలో వరి ధాన్యం తరుగుకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు

మరిన్ని వీడియోస్ కోసం:
Videos