Ram Mandir: అట్టముక్కలతో రామమందిరం.. రాముడిపై భక్తిని చాటుకున్న ఆర్ఎంపీ.
అయోధ్య రామమందిరంలో బాలరాముడు కొలువుదీరుతున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా భక్తులు రకరకాలుగా భక్తిని చాటుకుంటున్నారు. కొందరు కానుకలు సమర్పిస్తూ మరికొందరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మెదక్ జిల్లా కౌడిపల్లికి చెందిన ఆర్ఎంపీ రవి వెల్మకన్నె మాత్రం అట్టముక్కలతో అయోధ్య రామ మందిరం నమూనా తయారు చేసి అందరిని ఆకట్టుకుంటున్నారు.
అయోధ్య రామమందిరంలో బాలరాముడు కొలువుదీరుతున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా భక్తులు రకరకాలుగా భక్తిని చాటుకుంటున్నారు. కొందరు కానుకలు సమర్పిస్తూ మరికొందరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మెదక్ జిల్లా కౌడిపల్లికి చెందిన ఆర్ఎంపీ రవి వెల్మకన్నె మాత్రం అట్టముక్కలతో అయోధ్య రామ మందిరం నమూనా తయారు చేసి అందరిని ఆకట్టుకుంటున్నారు. ఫెవికోల్ సహాయంతో అట్టముక్కలను అతికిస్తూ రెండు శ్రమించి అయోధ్య రామ మందిర నిర్మాణం తరహాలో ఒక నమూనా తయారుచేశాడు. రాముడిపై అచంచల భక్తిని చాటుకున్న ఆర్ఎంపీ రవి కృషిని స్థానికులు ప్రశంసిస్తున్నారు. 5 శతాబ్ధాల తర్వాత అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగడం ఎంతో సంతోషంగా ఉందని రవి తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
వైరల్ వీడియోలు
Latest Videos