PM Modi: నేలపై నిద్ర, కొబ్బరి నీళ్లే ఆహారం.. రాముడి కోసం కఠిన దీక్షలో మోదీ.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఈనెల 22వ తేదీన ప్రధాని మోదీ రామాలయాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.దీక్షలో భాగంగా మోదీ కఠిన నియమాలు పాటిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకకు ముందు మోదీ 11 రోజులపాటూ అనుష్ఠాన దీక్ష చేపట్టారు.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఈనెల 22వ తేదీన ప్రధాని మోదీ రామాలయాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.దీక్షలో భాగంగా మోదీ కఠిన నియమాలు పాటిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకకు ముందు మోదీ 11 రోజులపాటూ అనుష్ఠాన దీక్ష చేపట్టారు. ప్రాణ ప్రతిష్ఠ కోసం భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహించే సాధనంగా దేవుడు తనను ఎన్నుకున్నట్లు ప్రధాని మోదీ ఇటీవల X వీడియో సందేశంలో తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తాను 11 రోజుల ప్రత్యేక దీక్షను చేపడుతున్నానని తెలిపారు. ప్రధాని 11 రోజుల కఠిన నియమాలకు కట్టుబడి ఉంటారని, గ్రంథాలలో పేర్కొన్న అన్ని సూచనలను కచ్చితంగా పాటించాలని నిర్ణయించుకున్నారని తాజాగా అధికారులు తెలిపారు.’యం నియమాన్ని పాటించే అభ్యాసకులు యోగా, ధ్యానంతో పాటు కఠినమైన కొన్ని ఇతర ప్రక్రియలను ఆచరించాల్సి ఉంటుందని అన్నారు. సూర్యోదయానికి ముందే బ్రహ్మముహూర్త సమయంలో మేల్కొవడం, ధ్యానం, సాత్వికాహారం వంటివి ఇప్పటికే మోదీ దినచర్యలో భాగమయ్యాయి. ప్రస్తుతం 11 రోజుల కఠోరమైన దీక్షలో బాగంగా ఉపవాసం చేయాలని ప్రధాని నిర్ణయించారని అధికారులు తెలిపారు. మోదీ ఈ 11 రోజులూ నేలపైనే నిద్రిస్తున్నట్లు చెప్పారు. కేవలం కొబ్బరినీళ్ల ను మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నట్లు వివరించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

