Hyderabad: కువైట్ చెక్కేసిన హాస్పిటల్‌ డాక్టర్‌.. అతని ఇంట్లో చెక్ చేయగా..

మళ్లీ మత్తు మరక. ఈసారి కొంగొత్తగా. డాక్టరై వుండి డ్రగ్స్‌ దందా కు బరితెగించాడు ముస్తఫా. పక్కా నిఘాతో మత్తు ఇంజెక్షన్ల రాకెట్‌ను బ్రేక్‌ చేశారు పోలీసులు.

Hyderabad: కువైట్ చెక్కేసిన హాస్పిటల్‌ డాక్టర్‌.. అతని ఇంట్లో చెక్ చేయగా..
Injection
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 18, 2024 | 10:14 PM

తెలంగాణలో డ్రగ్‌ మాఫియా పై సర్కార్‌ ఉక్కుపాదం మోపింది. డ్రగ్స్‌ అన్న పదం కూడా విన్పించకూడదని సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. మత్తు పదార్ధాల దందాలో ఎంతటి వారున్నా సరే ఉపేక్షించేలేదన్నారు. ఆ ప్రకారమే పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.ఐతే రాజేంద్రనగర్‌లో మరో రకం డ్రగ్‌ బెల్‌ మోగింది.

మత్తు ఇంజెక్షన్లను విక్రయిస్తున్న డాక్టర్‌ కపుల్స్‌ నిర్వాకం సంచలనం రేపింది. సమీర్‌ హాస్పిటల్‌లో అనస్థీషీయన్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ముస్తఫా ఫెంటానిల్ అనే మత్తు ఇంజక్షన్లను విక్రయిస్తున్న వైనం బయటపడింది. డాక్టర్ ముస్తఫా ఆయన భార్య ఓ యాప్‌ ద్వారా మత్తు ఇంజెక్షన్లను అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఒక్క బాక్స్‌ ఇంజెక్షన్స్‌ 17 వేల 5వందల చొప్పున సేల్ చేస్తున్నట్టు తేలింది. ఫెంటానిల్‌ ఇంజక్షన్‌ హెరాయిన్‌ కంటే 50 రెట్లు, మార్ఫైన్‌ కంటే వంద రెట్లు ప్రమాదకరమంటున్నారు వైద్యులు. మ్యాటర్‌ బయటపడ్డంతో డాక్టర్‌ ముస్తఫా కువైట్‌కు పారిపోయారు. ముస్తఫా ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు 57 ఫెంటానిల్‌ ఇంజక్షన్లు, 6 లక్షల క్యాష్‌ స్వాధీనం చేసుకున్నారు. ముస్తఫా భార్య నజీబ్‌ ఖాన్‌తో పాటు ఫెంటానిల్‌ ఇంజక్షను బానిసైన ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు పోలీసులు.

ఓవైపు నైజీరియన్‌ గ్యాంగ్‌ల నకరాలు…గోవా నుంచి సీక్రెట్‌గా మత్తు మందుల బట్వాడా… డ్రగ్‌ మాఫియాకు కళ్లెంవేసేలా ఖాకీలు డే అండ్‌ నైట్‌ నిఘా పెంచారు. కానీ మహానగరంపై ఏదోరకంగా మత్తు మరక పడుతూనే ఉంది. డాక్టరై వుండి మత్తుమందుల దందా చేస్తున్న ముస్తాఫా వ్యవహారం సంచలనం రేపుతోంది. డాక్టర్‌ బాబు డ్రగ్‌ ఇంజెక్షన్ల దందా కస్టమర్లు ఎవరెవరు? ఈ కేసులో ఇంకెన్ని సంచలనాలు ఖాయమనే చర్చ జరుగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!