AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: పేరు మర్చిపోతే జైల్లో పెడతారా..? అల్లు అర్జున్ అరెస్టు ఘటనపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో అరెస్టు అనంతరం అర్జున్ మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యారు.. అయితే.. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఫుల్ ఫోకస్ పెట్టారు.. అసలు తొక్కిసలాటకు కారణాలేంటి...? అప్పుడు థియేటర్‌ దగ్గర ఉన్న పరిస్థితులేంటి...? అన్ని వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నారు..

KTR: పేరు మర్చిపోతే జైల్లో పెడతారా..? అల్లు అర్జున్ అరెస్టు ఘటనపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
KTR
Shaik Madar Saheb
|

Updated on: Dec 18, 2024 | 8:29 AM

Share

సినీనటుడు అల్లు అర్జున్ అరెస్టు ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో అరెస్టు అనంతరం అర్జున్ మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యారు.. అయితే.. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఫుల్ ఫోకస్ పెట్టారు.. అసలు తొక్కిసలాటకు కారణాలేంటి…? అప్పుడు థియేటర్‌ దగ్గర ఉన్న పరిస్థితులేంటి…? అన్ని వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నారు.. కాగా.. అల్లు అర్జున్ అరెస్టు ఘటన విషయంలో.. అటు విపక్షాలు, ఇటు ప్రభుత్వం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. అల్లు అర్జున్ ను అనవసరంగా అరెస్టు చేశారని.. కుట్ర పూరితంగా వ్యవహరించారంటూ బీఆర్ఎస్ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అవుతోంది.. ఈ తరుణంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడనే అల్లు అర్జున్ ను జైల్లో పెట్టించారంటూ కేటీఆర్ పేర్కొన్నారు. పేరు మర్చిపోతే జైల్లో పెట్టడం అన్యాయమంటూ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.. మంగళవారం తెలంగాణ భవన్‌లో మాట్లాడిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కార్ రేసు, లగచర్ల ఘటనలపై ప్రభుత్వం కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ పేర్కొన్నారు.

వీడియో చూడండి..

అల్లు అర్జున్ అరెస్ట్ విచారకరమని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద పేర్కొన్నారు. దాన్ని సమర్థించేలా సీఎం రేవంత్ మాట్లాడారని ఆరోపించారు. సీఎం స్థాయి వ్యక్తి అలా మాట్లాడటం సరికాదన్నారు. రేవంత్‌ ర్యాలీలో ఎవరైనా చనిపోతే ఆయనను కూడా అరెస్ట్ చేస్తారా ? అని ప్రశ్నించారు వివేకానంద..

అల్లు అర్జున్ వస్తున్నట్లు ముందే ఎందుకు చెప్పలేదు…?

నటీనటులు వస్తున్నట్లు పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు…? థియేటర్‌ దగ్గర ఎంట్రీ, ఎగ్జిట్‌ బోర్డ్స్‌ ఎందుకు లేవు…? క్రౌడ్‌ వస్తారని తెలిసి అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు ఎందుకు చేయలేదు…? థియేటర్‌ చూట్టూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీల ఏర్పాటుకు ఎందుకు పర్మిషన్‌ ఇచ్చారు…? అల్లు అర్జున్ వస్తున్నారని పోలీసులకు ముందే ఎందుకు చెప్పలేదు…? ఇలా పలు ప్రశ్నలు సంధిస్తూ నోటీసులిచ్చారు పోలీసులు. ఈనెల 22లోగా వివరణ ఇవ్వాల్సిందేనన్నారు. 12 లోపాలు గుర్తించిన పోలీసులు అసలు థియేటర్‌ లైసెన్స్‌ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ నోటీసులిచ్చారు..

ఇక తొక్కిసలాట ఘటనలో 13 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను సీపీ సీవీ ఆనంద్ పరామర్శించారు. శ్రీతేజ్‌కు బ్రెయిన్‌ డ్యామేజ్‌ జరిగిందన్నారాయన. శ్రీతేజ్‌ కోలుకోవడానికి సమయం పడుతుందని… నిజానిజాలు త్వరలోనే తెలుస్తాయన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..