Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bakrid 2023: బోనాలు, బక్రీద్‌ పండగల వేళ నగరంలో గొర్రెలకు పెరిగిన డిమాండ్‌.. ధరలు ఎలా ఉన్నాయంటే?

బ‌క్రీద్ సంద‌ర్భంగా హైదరాబాద్‌లో గొర్రెల ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. గతేడాది ఉన్న ధరల కంటే ఇప్పుడు వేల రూపాయలు ఎక్కువ పలుకుతున్నాయి. హైదరాబాద్ న‌గ‌రంలో గొర్రెల ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఒక జత గొర్రెలను వ్యాపారులు రూ. 25 వేలకు విక్రయిస్తున్నారు.

Bakrid 2023: బోనాలు, బక్రీద్‌ పండగల వేళ నగరంలో గొర్రెలకు పెరిగిన డిమాండ్‌.. ధరలు ఎలా ఉన్నాయంటే?
Representative Image
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Basha Shek

Updated on: Jun 25, 2023 | 5:46 PM

ఓ పక్క బోనాలు.. మరో పక్క బక్రీద్‌ రావడంతో పొట్టేళ్లు, గొర్రెలు, మేకలకు డిమాండ్‌ బాగా పెరిగింది. రంజాన్ మాసం అయ్యాక 70 రోజులకు ఈదుల్ జుహా పండుగ వస్తుంది. ఇస్లామిక్ చరిత్ర ప్రకారం ఈదుల్ జుహా అనేది త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పండుగ. ముస్లింలు బక్రీద్‌ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే హజ్ యాత్ర సైతం ఈ నెలలోనే ఉంటుంది. ఈ ఏడాది బక్రీద్ ఎప్పుడనే విషయంలో మొన్నటి వరకూ ఉన్న సందిగ్దత తొలగిపోయింది. ఈ ఏడాది జూన్ 29న బక్రీద్‌ జరుపుకోనున్నారు. అయితే బ‌క్రీద్ సంద‌ర్భంగా హైదరాబాద్‌లో గొర్రెల ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. గతేడాది ఉన్న ధరల కంటే ఇప్పుడు వేల రూపాయలు ఎక్కువ పలుకుతున్నాయి. హైదరాబాద్ న‌గ‌రంలో గొర్రెల ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఒక జత గొర్రెలను వ్యాపారులు రూ. 25 వేలకు విక్రయిస్తున్నారు. గత ఏడాది బక్రీద్‌ సమయంలో ఉన్న ధర కంటే దాదాపు రూ.8 వేలు ఎక్కువ అని వ్యాపారులు అంటున్నారు. తెలంగాణలోని జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి కూడా హైదరాబాద్‌కు గొర్రెలు తరలివస్తున్నాయని, రేట్లు పెరగడానికి ఇంధన ఛార్జీలు కూడా కారణమని వ్యాపారులు చెబుతున్నారు. పండగ దగ్గర పడుతుండటంతో ధరలు మరింత పెరుగుతాయని హైదరాబాద్‌ వాసులు మార్కెట్లకు పరుగులు తీస్తున్నారు. బక్రీద్‌ సమయంలో గొర్రెలను వధించే ప్రక్రియనే ఖుర్బానీ అంటారు. ప్రస్తుత కాలంలో అపార్ట్‌మెంట్లలో ఖుర్బానీ చేసేందుకు చోటు ఉండటం లేదు. దాన్ని దృష్టిలో ఉంచుకుని కొందరు ఖుర్బానీ చేసిన తర్వాత మాంసాన్ని బంధువులు, స్నేహితులకు ఇంటికే తీసుకొచ్చి పంచిపెడుతున్నారు. అయినా నగరంలో చాలా మంది ఖుర్బానీ కోసం జంతువులను కొనుగోలు చేసే సాంప్రదాయ పద్ధతిని ఇష్టపడుతున్నారు.

కేవలం హైదరాబాద్‌ నగరంలోనే లక్షల కొద్దీ గొర్రెలు అమ్ముడుపోతాయని అంచనా. ముస్లింలు సాంప్రదాయం ప్రకారం గొర్రెలు లేదా పశువులను బ‌లి ఇచ్చి మాంసాన్ని మూడు సమాన భాగాలుగా విభజిస్తారు. ఒక భాగం స్నేహితులు, పరిచయస్తులు, కుటుంబ సభ్యులకు పంచుతారు. మిగతా భాగం పేదలకు ఇస్తారు. మిగిలిన చివరి భాగం గ్రహీత కోసం ఉంచుతారు. గొర్రెల విక్రయం కోసం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక మార్కెట్లు సిద్ధం చేశారు. మెహదీపట్నం, చంచల్‌గూడ, నానల్ నగర్, ఫలక్‌నుమా, ఖిల్వత్, షాహీన్ నగర్, చాంద్రాయణగుట్ట, కిషన్‌బాగ్, అజంపురా, గోల్నాక, బంజారాహిల్స్, జెహ్రా నగర్, బోరబండ ప్రాంతాల్లో సీజనల్ మార్కెట్‌లు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

క్యాన్సర్ సైలెంట్ కిల్లర్.. ఈ 5 లక్షణాలు అస్సలు లైట్ తీసుకోవద్దు
క్యాన్సర్ సైలెంట్ కిల్లర్.. ఈ 5 లక్షణాలు అస్సలు లైట్ తీసుకోవద్దు
ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడైనా తిన్నారా.?ఈ పండుతో ఆ సమస్యలకు చెక్
ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడైనా తిన్నారా.?ఈ పండుతో ఆ సమస్యలకు చెక్
SRHపై విజృంభించిన ముంబై! హిట్ మ్యాన్ సిక్సర్ల సంచలనం!
SRHపై విజృంభించిన ముంబై! హిట్ మ్యాన్ సిక్సర్ల సంచలనం!
కర్రెగుట్టలపై రెండు రోజులుగా బాంబుల వర్షం!
కర్రెగుట్టలపై రెండు రోజులుగా బాంబుల వర్షం!
రూ.345తో 60 రోజుల వ్యాలిడిటీ.. ఉత్తమ రీఛార్జ్‌ ప్లాన్స్‌..!
రూ.345తో 60 రోజుల వ్యాలిడిటీ.. ఉత్తమ రీఛార్జ్‌ ప్లాన్స్‌..!
ఐపీఎల్‌లో కామెంటరీ.. కట్ చేస్తే.. పీఎస్‌ఎల్‌లో ప్లేయర్‌.. ఎవరంటే?
ఐపీఎల్‌లో కామెంటరీ.. కట్ చేస్తే.. పీఎస్‌ఎల్‌లో ప్లేయర్‌.. ఎవరంటే?
కొత్త హీరోయిన్స్ ఆ హీరో బెడ్ ఎక్కాల్సిందే..
కొత్త హీరోయిన్స్ ఆ హీరో బెడ్ ఎక్కాల్సిందే..
వేసవిలో పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికి కూడా మస్తు డిమాండ్
వేసవిలో పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికి కూడా మస్తు డిమాండ్
బెట్టింగ్‌ యాప్స్‌ ఇష్యూ.. మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసులు!
బెట్టింగ్‌ యాప్స్‌ ఇష్యూ.. మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసులు!
పాన్‌ కార్డుకు గడువు ఉంటుందా..? మరణించిన వ్యక్తి కార్డ్ ఏమవుతుంది
పాన్‌ కార్డుకు గడువు ఉంటుందా..? మరణించిన వ్యక్తి కార్డ్ ఏమవుతుంది