AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రానున్న ఐదేళ్ళ పాలన బీజేపీకి అగ్నిపరీక్షేనా? వికసిత్‌ భారత్‌ కల సాకారమయ్యేనా?

సంపూర్ణ మెజార్టీతో పదేళ్లపాటు పాలన సాగించిన నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీకి ఇప్పుడు మిత్రపక్షాల తోడు అనివార్యమైంది. బీజేపీ అజెండాను ఇంతకాలం ఏ ఆటంకాలు లేకుండా అమలు చేసిన భారతీయ జనతాపార్టీకి అసలు సవాలు ముందుంది. వందరోజుల్లోనే సంచలన నిర్ణయాలుంటాయన్న..

రానున్న ఐదేళ్ళ పాలన బీజేపీకి అగ్నిపరీక్షేనా? వికసిత్‌ భారత్‌ కల సాకారమయ్యేనా?
Big News Big Debate
Ravi Kiran
|

Updated on: Jun 07, 2024 | 6:58 PM

Share

సంపూర్ణ మెజార్టీతో పదేళ్లపాటు పాలన సాగించిన నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీకి ఇప్పుడు మిత్రపక్షాల తోడు అనివార్యమైంది. బీజేపీ అజెండాను ఇంతకాలం ఏ ఆటంకాలు లేకుండా అమలు చేసిన భారతీయ జనతాపార్టీకి అసలు సవాలు ముందుంది. వందరోజుల్లోనే సంచలన నిర్ణయాలుంటాయన్న మోదీ కమిట్‌మెంట్‌ ఈ సంకీర్ణ పాలనలో సాకారమవుతుందా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే అతిపెద్ద నిర్ణయాలు ఉంటాయని పదేపదే చెప్పుకొచ్చారు ప్రధానమంత్రి. మరి ఆ కఠిన నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవడం సాధ్యమవుతుందా. ట్రిపుల్‌ తలాక్‌ నుంచి ఆర్టికల్‌ 370 వరకూ ఏ నిర్ణయం అయినా ధైర్యంగా తీసుకుని చట్టాలు చేసిన బీజేపీ ఇప్పుడు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుని బిల్లులు పెట్టగలదా.. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇక ఏ నిర్ణయం అయినా మిత్రులతో చర్చించాల్సిందే. అటు 230 మందికి పైగా సభ్యులతో బలమైన ప్రతిపక్షం సభలో ఉంటుంది. ఇంతకాలం బిల్లుల విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్న బీజేపీ ఇప్పుడు మిత్రపక్షాలను ఒప్పించడంతో పాటు ప్రతిపక్షాలకు సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇది చదవండి: హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్‌కి హాట్ కేకుల్లా ఇప్పుడీ ప్రాంతాలు.. మరో మాదాపూర్ అవ్వడం ఖాయం.!

ఇవి కూడా చదవండి

అయితే గతంలో అనుభవాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్డీయేలో ఉన్న పార్టీలు బీజేపీ నిర్ణయాలు వ్యతిరేకించే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. ఇవాళ జరిగిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో చంద్రబాబు, నితీశ్‌కుమార్‌ల మాటలే ఇందకు అద్దంపడుతున్నాయి. గతంతో పోల్చితే ప్రస్తుతం ఎన్డీయేలో మిత్రపక్షాలకు ప్రాధాన్యత అయితే పెరిగింది. ఎన్డీయే అంటే న్యూ ఇండియా డెవలప్‌డ్‌ ఇండియా, ఆస్పిరేషనల్‌ ఇండియా అంటూ కొత్త అర్థంతో మోదీ మిత్రపక్షాలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఎన్డీయేలోని పార్టీల మధ్య ప్రస్తుతం మెరుగైన బంధం ముడిపడినట్టు కనిపించినా భవిష్యత్తులో బీజేపీ అజెండా అయిన CAA, కామన్ సివిల్‌ కోడ్‌, వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ వంటి అంశాల్లో ఏకాభిప్రాయం ఉంటుందా?

ఇది చదవండి: పురావస్తు తవ్వకాల్లో బయటపడింది చూడగా స్టన్.! దెబ్బకు కళ్లు జిగేల్.. అదేంటంటే

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..