AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పురావస్తు తవ్వకాల్లో బయటపడింది చూడగా స్టన్.! దెబ్బకు కళ్లు జిగేల్.. అదేంటంటే

పురావస్తు తవ్వకాల్లో అప్పుడప్పుడూ అరుదైన సంఘటనలు జరుగుతుండటం మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి తవ్వకాల్లోనే మన పూర్వీకుల నాగరికతలను అద్దంపట్టే విధంగా కొన్ని వస్తువులు బయటపడుతుంటాయి. ఇక వాటికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియా వేదికగా తెగ సందడి చేస్తుంటాయి. ఆ వివరాలు ఇలా..

Viral: పురావస్తు తవ్వకాల్లో బయటపడింది చూడగా స్టన్.! దెబ్బకు కళ్లు జిగేల్.. అదేంటంటే
Viral News
Ravi Kiran
|

Updated on: Jun 06, 2024 | 8:53 PM

Share

పురావస్తు తవ్వకాల్లో అప్పుడప్పుడూ అరుదైన సంఘటనలు జరుగుతుండటం మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి తవ్వకాల్లోనే మన పూర్వీకుల నాగరికతలను అద్దంపట్టే విధంగా కొన్ని వస్తువులు బయటపడుతుంటాయి. ఇక వాటికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియా వేదికగా తెగ సందడి చేస్తుంటాయి.

దక్షిణ కజకిస్తాన్‌లోని టర్కిస్తాన్ ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు ఓ పురాతన నిధిని కనుగొన్నారు. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో 2000 ఏళ్ల నాటి బంగారు ఆభరణాలు లభించాయని, వీటిని పురావస్తు శాస్త్రవేత్తలు విలువైనవిగా పేర్కొంటున్నారు. స్థానికంగా ఉన్న మూడు పురాతన శవపేటికలను కనుగొన్న పరిశోధనా బృందం.. వాటిల్లో రెండింటిని దోచుకున్నారని గుర్తించారు. ఇక మిగిలిన ఒకదానిలో ఉన్న పురాతన విలువైన ఆభరణాలను బయటకు తీశారు. రోమన్ స్టైల్ బ్రూచ్, పెద్ద అలాగే చిన్న పూసలు. రెండు బంగారు చెవిపోగులు, ఒక కాంస్య అద్దం, మట్టి కూజా లాంటి పురాతన సామాగ్రి ఆ శవపేటికలో దొరికింది.

ఇది చదవండి: తస్సాదియ్యా.! దమ్ముందా.? ఈ ఫోటోలోని నెంబర్‌ కనిపెడితే.. మీరే తెలివైన వారు..

ఇవి కూడా చదవండి

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చెవిపోగులు అర్ధ చంద్రుని ఆకారంలో తయారు చేయబడ్డాయి. సూర్యరశ్మిని ప్రతిబింబించేలా రూపొందించబడిన ద్రాక్ష సమూహాలుగా పోలిన బంగారు బటన్లు ఈ చెవిపోగులు ఉండటం విశేషం. ఈ చెవిపోగులను చూసిన తర్వాత పరిశోధనా బృందం చీఫ్.. ఇవి క్రీ.పూ. ఐదవ శతాబ్దం నుంచి క్రీ.శ. నాల్గవ శతాబ్దం సంబంధించిన కాంగ్జు హయాంలో తయారైనవిగా చెప్పారు. మరోవైపు కాంగ్జు పాలనలో వాణిజ్య ఒప్పందాలు పురాతన చైనా, దక్షిణాన కుషాన్ సామ్రాజ్యం మధ్య సాగాయి. అందుకే చెవిపోగులు తయారు చేసే శైలి వృత్తాకారంలో ఉంది. దీనితో పాటు, ఈ చెవిపోగులతో ఖననం చేయబడిన మహిళ చాలా ధనవంతురాలై ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు.

ఇది చదవండి: వర్షాకాలంలో పాములు ఇంట్లోకి వస్తున్నాయా.? ఈ వంటింటి చిట్కాలతో ఈజీగా తరిమేయండి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి