AP News: తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికెళ్లిన యువతి.. తీరా ఎక్స్‌రే చూడగా బిత్తరపోయింది..
తీవ్రమైన కడుపునొప్పితో ఓ మహిళ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడున్న వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి.. స్కాన్ చేసి.. ఎక్స్‌రే తీయగా.. షాకింగ్ విషయం ఒకటి బయటకొచ్చింది. చివరికి బ్రతుకు జీవుడా.. అంటూ బ్రతికి బయటపడింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
తీవ్రమైన కడుపునొప్పితో ఓ మహిళ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడున్న వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి.. స్కాన్ చేసి.. ఎక్స్‌రే తీయగా.. షాకింగ్ విషయం ఒకటి బయటకొచ్చింది. చివరికి బ్రతుకు జీవుడా.. అంటూ బ్రతికి బయటపడింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా..
వివరాల్లోకెళ్తే.. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం కోతులగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దారుణం జరిగింది. కుళ్లపాడు గ్రామానికి చెందిన షేక్ జాస్మిన్‌కి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లో దూది, చిన్న వైరు కడుపులో వదిలేశారు డాక్టర్లు. మే 27వ తేదీన కూనవరం ప్రభుత్వ ఆసుపత్రిలో సదరు బాధితురాలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. ఇక ఆపరేషన్ అయినప్పటి నుంచి ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. దీంతో చేసేదేమిలేక భద్రాచలంలోని ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించింది బాధితురాలు. అక్కడ వైద్య సిబ్బంది స్కానింగ్ చేసి.. ఎక్స్‌రే తీయగా.. ఆమె కడుపులో దూది, వైరు ముక్క ఉన్నట్టు గుర్తించారు. హుటాహుటిన డాక్టర్లు ఆపరేషన్ చేసి.. వాటిని బయటకు తీయడంతో.. ప్రాణాపాయస్థితి నుంచి బయటపడింది బాధితురాలు. కాగా, తనకు ఇలా చేసిన కోతులగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద సదరు బాధితురాలు.. న్యాయం కోసం ఆందోళనకు దిగింది.
ఇది చదవండి: చల్ల.. చల్లగా.! ఏపీలో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

