వర్షాకాలంలో పాములు ఇంట్లోకి వస్తున్నాయా.? ఈ వంటింటి చిట్కాలతో ఈజీగా తరిమేయండి..
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. విషపూరితమైన పాములు, పురుగుల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. పురుగుల గురించి పక్కన పెడితే.. పాములు మాత్రం ఈ వర్షాకాలంలో ఇళ్లలోకి.. పెరట్లోకి వస్తుంటాయి. మీరు అవి రాకుండా ఉండేందుకు సరైన జాగ్రతలు తీసుకోకపోతే.. పాములు మిమ్మల్ని కాటేస్తాయి.
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. విషపూరితమైన పాములు, పురుగుల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. పురుగుల గురించి పక్కన పెడితే.. పాములు మాత్రం ఈ వర్షాకాలంలో ఇళ్లలోకి.. పెరట్లోకి వస్తుంటాయి. మీరు అవి రాకుండా ఉండేందుకు సరైన జాగ్రతలు తీసుకోకపోతే.. పాములు మిమ్మల్ని కాటేస్తాయి. మరి వర్షాకాలంలో మన ఇంటి చుట్టూ, పెరట్లోకి పాములు రాకుండా ఉండాలంటే ఈ సింపుల్ వంటింటి చిట్కాలు పాటిస్తే చాలు.. మరి అవేంటో చూసేద్దామా..
-
పాములు రాకుండా వెల్లుల్లి పొడిని ఇంటి చుట్టూ చల్లుకోవడం మంచిది.
-
ఆవాల నూనెలో వెల్లుల్లిని చూర్ణం చేసి ఇంటి చుట్టూ పిచికారీ చేయడం వల్ల పాములు రాకుండా ఉంటాయి.
ఇవి కూడా చదవండి -
మీ ఇంటి బెడ్‌పై ఫినైల్‌ను పిచికారీ చేస్తే ఘాటైన వాసనకు పాములు పారిపోతాయి.
-
పాములను ఇంట్లోకి రాకుండా చేయడానికి వెనిగర్, కిరోసిన్ నూనెను ఉపయోగించవచ్చు. దీని ఘాటైన సువాసన పాములను పారిపోయేలా చేస్తుంది.
-
పాములు దరికి చేరకుండా ఉండాలంటే నిమ్మరసంలో ఎర్ర మిరియాలు లేదా నిమ్మకాయ పొడిని కలిపి ఇంటి చుట్టూ చల్లుకోవాలి.
-
కుళ్లిన ఉల్లిపాయలను ఇంటి చుట్టూ వెదజల్లడం వల్ల విషపూరిత పాములను కూడా అరికట్టవచ్చు.
-
లవంగం, దాల్చిన చెక్క నూనెను ఇంటి చుట్టూ స్ప్రే చేయడం వల్ల పాములను దూరంగా ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
ఇది చదవండి: చేపల వల బరువెక్కడంతో జాలర్లు సంబరపడ్డారు.. తీరా పైకి లాగి చూడగా.!
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి