ఉద్యోగుల ఒత్తిడిని తగ్గించడానికి అరటిపండ్ల సాయం తీసుకుంటున్న కంపెనీలు ఎక్కడంటే..
అరటిపండు మనకు మానవులకు ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. అయితే ఒక చైనీస్ కంపెనీ తన ఉద్యోగుల ఒత్తిడిని తగ్గించడానికి అరటి పళ్లను, అరటి గెలను ఉపయోగిస్తోంది. అవును మీరు చదివింది నిజమే.. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం చైనీస్ ఉద్యోగుల ఒత్తిడిని తగ్గించడానికి అరటిపండ్లను ఉపయోగిస్తున్నారు.
నేటి కాలంలో ఉద్యోగంలో ఒత్తిడి అనేది ఒక సాధారణ విషయం. అయితే ఈ ఒత్తిడి దైనందిన జీవితాన్ని, ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ ఒత్తిడికి గల కారణమా ఆఫీస్ వాతావరణం, పని ఒత్తిడి, సుదీర్ఘ పని షెడ్యూల్, గడువు వంటి అనేక అంశాలు ఉన్నాయి. అయితే తమ ఉద్యోగస్తులు పని చేస్తున్నప్పుడు.. రోజువారీ దినచర్యలో ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటే.. అనేక కంపెనీలు కొన్ని చర్యలు తీసుకుంటాయి. ఒత్తిడి తగ్గించే విధంగా ప్రత్యేక సౌకర్యాలను కూడా కల్పిస్తున్నాయి. సాధారణంగా తమ ఉద్యోగస్తులకు ఒత్తిడి నుంచి ఉపశమనం లభించేలా అవుట్‌డోర్ లేదా ఇండోర్ గేమ్‌లు ఏర్పాటు చేస్తారు. అయితే ప్రస్తుతం ఒక చైనీస్ కంపెనీ తన ఉద్యోగుల కోసం ఓ వింత ప్రయోగం చేసి వార్తల్లో నిలిచింది.
అరటిపండు మనకు మానవులకు ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. అయితే ఒక చైనీస్ కంపెనీ తన ఉద్యోగుల ఒత్తిడిని తగ్గించడానికి అరటి పళ్లను, అరటి గెలను ఉపయోగిస్తోంది. అవును మీరు చదివింది నిజమే.. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం చైనీస్ ఉద్యోగుల ఒత్తిడిని తగ్గించడానికి అరటిపండ్లను ఉపయోగిస్తున్నారు.
అరటిపండు ఒత్తిడిని ఎలా తగ్గిస్తుందంటే?
నివేదిక ప్రకారం చాలా కంపెనీలు తమ ఆఫీసుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాయి. దీనిలో అరటిపండ్ల గెలను ఉద్యోగస్తుల డెస్క్ పై ఉంచినట్లు కనిపిస్తుంది. అరటిపండ్ల గెలను ఉద్యోగుల టేబుల్స్ మీద కుండీల్లో పెట్టారు. అవి పచ్చిగా ఉన్నప్పుడు టేబుల్ పై పెట్టారు.. పసుపు రంగులోకి మారి పండే వరకూ వేచి చూసి పసుపు రంగులోకి మారగానే ఉద్యోగులు ఆ అరటి పండ్లను తింటారు. ఈ ప్రక్రియకు దాదాపు ఒక వారం పడుతుంది. కంపెనీలు చేపట్టిన ప్రక్రియతో ఉద్యోగస్తులు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.
చైనీస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం డెస్క్‌టాప్ దగ్గర ఉద్యోగస్తులు పని చేయడంలో ఒత్తిడి ఉన్నట్లు భావించడం లేదు. తమ టేబుల్ మీద అరటి పండ్ల గెలను పెట్టినప్పటి నుంచి అవి ఎప్పుడు పక్వానికి వస్తాయా అంటూ గమనిస్తూ.. వాటి గురించి ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. దీంతో ఆఫీసులో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గి తమ పనిపై మరింత శ్రద్ధ పెడతాడని చెబుతున్నారు. అంతే కాకుండా ఉద్యోగుల్లో ఆహారాన్ని పంచుకునే అలవాటు పెంపొందించుతుందని.. ఆఫీసులో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని చెబుతున్నారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో అడుగు పెట్టిన వెంటనే.. అది వైరల్‌గా మారింది. కంపెనీ ఐడియా పై రకరకాల కామెంట్స్ ద్వారా అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..