భజన కీర్తనలో చప్పట్లు కొట్టడం ఎప్పుడు మొదలైందంటే? ఆధ్యాత్మిక ప్రాముఖ్యత తెలుసుకోండి..

పురాణాల ప్రకారం చప్పట్లు కొట్టే సంప్రదాయం భక్త ప్రహ్లాదుడి వలన మొదలైంది అని నమ్ముతారు. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశ్యపునికి ప్రహ్లాదుడు..  విష్ణువును పూజించడం, అతని కీర్తనలు పాడడం ఇష్టం లేదు. అందువలన ప్రహ్లాదుని భజన కీర్తనలో ఉపయోగించే అన్ని సంగీత వాయిద్యాలను ధ్వంసం చేశాడట. అప్పుడు ప్రహ్లాదుడు భజన కీర్తనలో లయను కొనసాగించలేకపోయాడు.. భజన, కీర్తన చేసే సమయంలో  ఇబ్బంది పడ్డాడు. అప్పుడు ప్రహ్లాదుడు భగవంతుని కీర్తనలో లయను సృష్టించడానికి చప్పట్లు కొట్టడం ప్రారంభించాడు

భజన కీర్తనలో చప్పట్లు కొట్టడం ఎప్పుడు మొదలైందంటే? ఆధ్యాత్మిక ప్రాముఖ్యత తెలుసుకోండి..
Clapping In Temple
Follow us
Surya Kala

|

Updated on: Jun 06, 2024 | 9:25 AM

మానవులు చప్పట్లు కొట్టే పద్దతి పూర్వకాలం నుంచి ఉంది. వివిధ సందర్భాలలో చప్పట్లు కొడతారు. దేవుడికి  భజన చేసే సమయంలో లేదా కీర్తించే సమయంలో కూడా చప్పట్లు కొట్టడం తప్పనిసరి. చప్పట్లు కొట్టడం అనేది ఉత్సాహం.. ఆనందంతో ..ఇతరులను ప్రశంసించడానికి చేసే ఓ పని. అంతేకాదు ఇతరులు చేసిన  మంచి పనిని ప్రశంసించడానికి కూడా చప్పట్లు ఉపయోగిస్తారు. అయితే చప్పట్లు కొట్టడం ఎలా మొదలైందో వివరంగా తెలుసుకుందాం.

భక్త ప్రహ్లాదుడితో ముడిపడిన చప్పట్లు కొట్టే సంప్రదాయం

పురాణాల ప్రకారం చప్పట్లు కొట్టే సంప్రదాయం భక్త ప్రహ్లాదుడి వలన మొదలైంది అని నమ్ముతారు. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశ్యపునికి ప్రహ్లాదుడు..  విష్ణువును పూజించడం, అతని కీర్తనలు పాడడం ఇష్టం లేదు. అందువలన ప్రహ్లాదుని భజన కీర్తనలో ఉపయోగించే అన్ని సంగీత వాయిద్యాలను ధ్వంసం చేశాడట. అప్పుడు ప్రహ్లాదుడు భజన కీర్తనలో లయను కొనసాగించలేకపోయాడు.. భజన, కీర్తన చేసే సమయంలో  ఇబ్బంది పడ్డాడు. అప్పుడు ప్రహ్లాదుడు భగవంతుని కీర్తనలో లయను సృష్టించడానికి చప్పట్లు కొట్టడం ప్రారంభించాడు. దీని తరువాత ఇతర వ్యక్తులు కూడా ప్రహ్లాదుడిలా భజన కీర్తనలో చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. అప్పటి నుంచి చప్పట్లు కొట్టే సంప్రదాయం ప్రారంభమైందని పురాణాల ప్రతీతి.

ఇవి కూడా చదవండి

చప్పట్లు కొట్టడంలో మతపరమైన ప్రాముఖ్యత

భజన-కీర్తన, ఆరతి ఇచ్చే సమయంలో చప్పట్లు కొట్టడం అనేది భగవంతుని పట్ల శ్రద్ధ, భక్తిని వ్యక్తీకరించడానికి ఒక మాధ్యమం. భజన కీర్తనలో అందరూ కలిసి ఒకేసారి చప్పట్లు కొట్టడం వలన భక్తుల ఉత్సాహానికి ఐక్యతకు చిహ్నం. హిందూ మత విశ్వాసాల ప్రకారం చప్పట్లు కొట్టడం వల్ల పర్యావరణంలో  సానుకూల శక్తిని నిండుతుందని ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని నమ్ముతారు. ఇది ప్రార్థనా స్థలాన్ని పవిత్రంగా చేస్తుంది. చప్పట్లు కొట్టడం అనేది ధ్యానం సమయంలో మానసిక ఏకాగ్రత, మానసిక ప్రశాంతతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది, దీని కారణంగా భక్తులు పూర్తి ఏకాగ్రతతో భజన కీర్తనపై దృష్టి కేంద్రీకరించగలుగుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు