AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిడెన్ నుంచి పుతిన్ వరకు ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపిన గ్లోబల్ లీడర్లు.. కొందరికి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌లతో సహా 75 మంది ప్రపంచ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి.. ఎన్డీయే పార్టీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. దీంతో ప్రభుత్వ కార్యాలయం లోతైన ద్వైపాక్షిక సంబంధాల ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. మరోవైపు నరేంద్ర మోడీ తన ప్రమాణ స్వీకారానికి భూటాన్ రాజు, శ్రీలంక అధ్యక్షుడు, నేపాల్, బంగ్లాదేశ్, మారిషస్ ప్రధాన మంత్రులను ఆహ్వానించారు.

బిడెన్ నుంచి పుతిన్ వరకు ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపిన గ్లోబల్ లీడర్లు.. కొందరికి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం
World Leaders Congratulate Pm Modi
Surya Kala
|

Updated on: Jun 06, 2024 | 8:25 AM

Share

ఉత్కంఠతకు తెర దింపుతూ లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. మళ్ళీ ఎన్డీయే అతిపెద్ద పార్టీగా అవతరించింది. వరసగా మూడో సారి ప్రభుత్వం అధికారం దిశగా అడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివిధ దేశాల నాయకులు విశేష్ ను తెలియజేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌లతో సహా 75 మంది ప్రపంచ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి.. ఎన్డీయే పార్టీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. దీంతో ప్రభుత్వ కార్యాలయం లోతైన ద్వైపాక్షిక సంబంధాల ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. మరోవైపు నరేంద్ర మోడీ తన ప్రమాణ స్వీకారానికి భూటాన్ రాజు, శ్రీలంక అధ్యక్షుడు, నేపాల్, బంగ్లాదేశ్, మారిషస్ ప్రధాన మంత్రులను ఆహ్వానించారు.

అధ్యక్షుడు పుతిన్, సునక్ వేర్వేరుగా ఫోన్ చేసి మోడీతో మాట్లాడారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, తైవాన్ ప్రెసిడెంట్ లై చింగ్ టె, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా మోడీకి అభినందనలు తెలియజేసారు.

ఇవి కూడా చదవండి

ప్రధాని నరేంద్ర మోదీకి బిడెన్‌ అభినందనలు తెలిపారు బిడెన్ ట్విట్టర్‌ ద్వార ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలియజేశారు. “ఈ చారిత్రాత్మక ఎన్నికల్లో విజయం సాధించినందుకు.. దాదాపు 650 మిలియన్ల ఓటర్ల మద్దతు పొందిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌కు అభినందనలు చెప్పారు. ఈ ఎన్నికలు “చారిత్రక ఎన్నికలు” అని పేర్కొన్నారు. అపరిమిత అవకాశాలతో కూడిన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ.. మన దేశాల మధ్య స్నేహం మరింత పెరిగేలా చేయాలనీ ఆయన అన్నారు.

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కూడా ప్రధాని మోడీని అభినందిస్తూ ఒక సందేశాన్ని పోస్ట్ చేసారు. బీజింగ్ “ఆరోగ్యకరమైన, స్థిరమైన చైనా-భారత సంబంధాల” కోసం ఎదురు చూస్తోందని అన్నారు. జి-20 దేశాలలో అధ్యక్షుడు మాక్రాన్, జర్మన్ ఛాన్సలర్ స్కోల్జ్, ఇటలీ, జపాన్ ప్రధానులు, దక్షిణ కొరియా అధ్యక్షుడు మోడీ ఎన్నికల విజయంపై అభినందనలు తెలిపారు.

బ్రిటన్ ప్రధాని సునక్ మోదీతో మాట్లాడారు

రష్యా అద్యక్షుడు పుతిన్, మోడీని అభినందించారు. భారతదేశంతో ప్రత్యేక , విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యానికి, బలమైన సంబంధానికి రష్యా చాలా ప్రాముఖ్యతనిస్తుంది. ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయం మాట్లాడుతూ పుతిన్ మోదీకి ఫోన్ చేసి హృదయపూర్వకంగా అభినందించారని, ఎన్నికల విజయం భారత నాయకత్వం అనుసరించిన మార్గానికి ఈ మద్దతు ప్రతిబింబిస్తుందని అన్నారు. భారతదేశానికి ఇరుగు పొరుగు దేశాలమైన మాల్దీవులు, ఇరాన్, సీషెల్స్ అధ్యక్షులు, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, మారిషస్ ప్రధానులు మోడీకి అభినందనలు తెలిపారు.

బ్రిటన్ ప్రధాని సునక్ మోడీతో మాట్లాడి ఎన్నికల విజయంపై అభినందనలు తెలిపారు. బ్రిటన్, భారత్ మధ్య అత్యంత సన్నిహిత స్నేహం ఉందని, భవిష్యత్తులో కూడా ఈ స్నేహం కొనసాగుతుందని ఆయన అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను అని మోడీకి రాసిన లేఖలో స్కోల్జ్ పేర్కొన్నారు. మన ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని చెప్పారు. జర్మనీ-భారత సంబంధాలను మరింతగా బలోపేతం చేసేందుకు, అంతర్జాతీయ, ప్రపంచ సమస్యలపై పని చేయడానికి సహకారాన్ని కొనసాగిస్తామని ఆయన అన్నారు.

వరుసగా మూడోసారి ప్రధాని మంత్రిగా ఎన్నికైన ప్రధాని నరేంద్రమోడీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా తెలిపారు

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన సందేశంలో ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడిగా భారతదేశ ప్రజల ఆశలు,యు ఆకాంక్షలను మోడీ మోస్తున్నారని చెప్పారు. మీ నాయకత్వం, నిబద్ధత , దేశం పట్ల అచంచలమైన అంకితభావంపై భారతదేశ ప్రజలు ఉంచిన విశ్వాసం..ఆ విశ్వాసానికి మీ అద్భుతమైన విజయం నిదర్శనమని షేక్ హసీనా అన్నారు.

భారత్, ఇజ్రాయెల్ మధ్య స్నేహం కొత్త శిఖరాలకు ఎదుగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆఫ్రికా నుంచి కెన్యా, నైజీరియా, కొమొరోస్ దేశాధ్యక్షులు మోడీకి అభినందనలు తెలిపారు. కరేబియన్ దీవులైన జమైకా, బార్బడోస్, గయానా దేశాలకు చెందిన నేతలు కూడా మోడీకి అభినందనలు తెలిపారు. మోడీకి శుభాకాంక్షలు తెలిపిన ఆగ్నేయాసియా నేతల్లో మలేషియా ప్రధాని కూడా ఉన్నారు.

మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ తన సందేశంలో మోడీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే తెలిపారు. భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ టోబ్‌గే కూడా మోడీ ప్రధాని గా ఎన్నికై పదవి చేపనున్నారు. ఈ మూడో దఫాలో భారత్‌-భూటాన్‌ సంబంధాలను మరింత పటిష్టం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..