JoSAA Counselling 2024: జోసా కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. జూన్‌ 10 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం

దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో బీటెక్‌ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌ ఫలితాలు త్వరలో విడుదలవనున్నాయి. ఇందులో ర్యాంకు సాధించిన వారికి జోసా కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లను..

JoSAA Counselling 2024: జోసా కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. జూన్‌ 10 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం
JoSAA Counselling 2024 schedule
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 06, 2024 | 2:13 PM

న్యూఢిల్లీ, జూన్‌ 6: దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో బీటెక్‌ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌ ఫలితాలు త్వరలో విడుదలవనున్నాయి. ఇందులో ర్యాంకు సాధించిన వారికి జోసా కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లను కేటాయిస్తారు. ఇందుకు సంబంధించి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ గురువారం (జూన్‌ 6) విడుదలైంది. జోసా కౌన్సెలింగ్‌ మొత్తం 44 రోజుల పాటు కొనసాగనుంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు జూన్‌ 9వ తేదీన విడుదలవుతాయి. ఆ మరుసటి రోజు అంటే జూన్‌ 10 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ రోజు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. జూన్‌ 17వ తేదీ వరకు అర్హత సాధించిన విద్యార్థులకు రెండు సార్లు నమూనా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. వీటిద్వారా విద్యార్థులు తమ ర్యాంకుకు ఎక్కడ సీటు లభిస్తుందో తెలుసుకోవచ్చన్నమాట. జోసా కౌన్సెలింగ్‌ మొత్తం 5 విడతల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. జులై 23వ తేదీతో ఐదో విడత సీట్ల కేటాయింపు పూర్తవుతుంది. జోసా కౌన్సెలింగ్‌లో ఈసారి మొత్తం 121 విద్యాసంస్థలు పాల్గొననున్నాయి. జోసా చివర విడత సీట్ల కేటాయింపు జులై 17వ తేదీతో ముగుస్తుంది. ఆ తర్వాత మిగిలిపోయిన సీట్లకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ జరుపుతారు. ఈ ప్రక్రియ జులై 26వ తేదీతో ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి

జోసా కౌన్సెలింగ్‌ 2024 షెడ్యూల్‌ ఇదే..

  • జూన్‌ 18- తొలి విడత కౌన్సెలింగ్‌ కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, వెబ్‌ ఆప్షన్ల నమోదు
  • జూన్‌ 20 – సీట్ల కేటాయింపు
  • జూన్‌ 27 – రెండో విడత సీట్ల కేటాయింపు
  • జులై 4 – మూడో విడత సీట్ల కేటాయింపు
  • జులై 10 – నాలుగో విడత సీట్ల కేటాయింపు
  • జులై 17 – ఐదో విడత సీట్ల కేటాయింపు

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!