AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో కరివేపాకు మొక్కను పెంచుకోవడానికి కూడా దిశ ఉందని తెలుసా..! ఏ వైపు నాటితే మంచిదంటే..

వాస్తు ప్రకారం మొక్కలను, చెట్లను ఇంట్లో తప్పుడు ప్రదేశంలో నాటడం వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. కరివేపాకు మొక్క చాలా మంది ఇళ్లలో విరివిగా పెరగడం చూస్తుంటాం. కొన్ని చోట్ల కరివేపాకు చెట్టు ఎండిపోయిన స్థితిలో ఉంటుంది.. అయితే ప్రతి వస్తువుకు దాని స్థానం ఉన్నట్లే ఇంట్లో పెంచుకునే కరివేపాకు మొక్కను నాటడానికి కూడా సరైన స్థానం ఉంది. దీని ప్రకారం, కరివేపాకులను నాటడానికి సరైన స్థలం ఏది? ఇంట్లో ఏ దిశలో కరివేపాకు మొక్కను నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుందో జ్యోతిష్కులు చెప్పిన విషయాలను గురించి ఈ రోజు తెలుసుకుందాం..

Vastu Tips: ఇంట్లో కరివేపాకు మొక్కను పెంచుకోవడానికి కూడా దిశ ఉందని తెలుసా..! ఏ వైపు నాటితే మంచిదంటే..
జుట్టు రాలడానికి కారణం కుదుళ్ళు ఆరోగ్యంగా లేకపోవడమే.. ఇందుకు ప్రోటీన్ లోపం, ఐరన్ లోపం. ఈ రెండు లోపాల కారణంగా జుట్టు రాలుతుంది. అయితే, కరివేపాకు తింటే ఈ సమస్యలు దూరమవుతాయి. కరివేపాకులో విటమిన్ బి12, విటమిన్ ఇ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
Surya Kala
|

Updated on: Jun 06, 2024 | 7:02 AM

Share

హిందూ మతంలో వాస్తుకు చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో, ఇంటి ఆవరణలో వాస్తు దోషాలను తొలగించడానికి, జీవితంలో ఆనందం, శ్రేయస్సు కోసం అనేక రకాల నివారణ చర్యలు సూచించబడ్డాయి. మనిషి జీవితంలో చెట్లు, మొక్కలు చాలా ముఖ్యమైనవి. కొంతమందికి ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలను పెంచడం ఎంతగానో ఇష్టం. అయితే చాలా సార్లు, తెలిసి, తెలియక చేసే పనులు అశుభ ఫలితాలను ఇస్తాయి. కష్ట, నష్టాలను ఎదుర్కోవల్సి ఉంటుంది. దీంతో వాస్తు శాస్త్రంలో చెట్లు, మొక్కల పెంపకానికి సరైన దిశ నిర్దేశించబడింది. చెట్లు, మొక్కలు నాటడం ద్వారా కూడా సుఖ సంపదలను పొందవచ్చు.

వాస్తు ప్రకారం మొక్కలను, చెట్లను ఇంట్లో తప్పుడు ప్రదేశంలో నాటడం వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. కరివేపాకు మొక్క చాలా మంది ఇళ్లలో విరివిగా పెరగడం చూస్తుంటాం. కొన్ని చోట్ల కరివేపాకు చెట్టు ఎండిపోయిన స్థితిలో ఉంటుంది.. అయితే ప్రతి వస్తువుకు దాని స్థానం ఉన్నట్లే ఇంట్లో పెంచుకునే కరివేపాకు మొక్కను నాటడానికి కూడా సరైన స్థానం ఉంది. దీని ప్రకారం, కరివేపాకులను నాటడానికి సరైన స్థలం ఏది? ఇంట్లో ఏ దిశలో కరివేపాకు మొక్కను నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుందో జ్యోతిష్కులు చెప్పిన విషయాలను గురించి ఈ రోజు తెలుసుకుందాం..

ఏ దిశలో నాటాలంటే..

  1. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి పడమర వైపు కరివేపాకులను నాటడానికి అనువైన ప్రదేశం. ఈ పశ్చిమ దిక్కు చంద్రుని దిశగా పరిగణించబడుతుంది (చంద్రదోష పరిహారం), ఈ దిశలో ఏదైనా దేశీయ మొక్కను నాటడం శుభ ఫలితాలను ఇస్తుంది. కనుక కరివేపాకు మొక్కను ఈ దిశలో నాటడం ద్వారా..కరివేపాకు మొక్క ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. అయితే ఈ ప్రాంతంలో ఇతర మొక్కలు లేదా చెట్లను నాటవద్దు.
  2. కరివేపాకు మొక్క పెరిగే ప్రదేశంలో మురికి నీరు చేరకుండా చూసుకోవాలి. కిచెన్ సింక్ నుంచి నీరు ప్రావించే చోట కరివేపాకు మొక్కలను నాటవద్దు
  3. కరివేపాకు మొక్కను పురుగులు, చీడ నుంచి రక్షించుకోండి. ఆకులకు గొంగళి పురుగులు పడితే వెంటనే ఆ ఆకులను తొలగించండి. లేదంటే ఇంట్లో సామరస్యానికి కూడా విఘాతం కలిగిస్తుంది
  4. కరివేపాకు మొక్క పక్కన చింత చెట్టుని పెంచవద్దు. ఇది మీ ఆర్థిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది

ఆరోగ్య పరంగా

కరివేపాకు మొక్కలను జ్యోతిష్య శాస్త్రంలో మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. కరివేపాకు క్యాన్సర్ , మధుమేహం నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీని ఆకులలో యాంటీ మ్యుటాజెనిక్ గుణాలు ఉన్నాయి. ఇవి కడుపు క్యాన్సర్‌ను తొలగించడంలో సహాయపడతాయి. అంతే కాదు గుండె జబ్బులు రాకుండా చేయడంలో ఇది చాలా మేలు చేస్తుంది. కరివేపాకు కళ్లకు కూడా మంచిదని భావిస్తారు.

ఇవి కూడా చదవండి

ఫెంగ్ షుయ్ చిట్కా

ఫెంగ్ షుయ్ చిట్కాల ప్రకారం ఇంటి దక్షిణ మూలలో కరివేపాకులను నాటడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ దిశలో కరివేపాకు మొక్కను పెంచడం ద్వారా సంపద, శ్రేయస్సును పొందవచ్చు. కాబట్టి ఈ దిశలో కరివేపాకు మొక్కను నాటండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..